Beast Movie Unit PressMeet: దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం బీస్ట్. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 13న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన వేడుకలకు దర్శకుడు నెల్సన్ తోపాటు సంగీత దర్శకుడు అనిరుధ్ , కథానాయిక పూజా హెగ్డే హాజరై సందడి చేశారు. బీస్ట్ చిత్రంలోని పాటలకు నృత్యాలు చేసి అభిమానులను అలరించారు. బీస్ట్ చిత్రం ఘన విజయం సాధించడం ఖాయమని నిర్మాత దిల్ రాజు ధీమా వ్యక్తం చేయగా...బీస్ట్ చిత్రంతో తమిళంలో అడుగుపెడుతుండటం ఎంతో ఆనందంగా ఉందని పూజా హెగ్డే తెలిపింది. విజయ్ తో చేస్తున్న చిత్రాలు వరుస విజయాలు సాధిస్తున్నాయని, తెలుగులో కూడా మంచి చిత్రాలు చేస్తున్నట్లు సంగీత దర్శకుడు అనిరుధ్ తెలిపాడు.
హైదరాబాద్‌లో 'బీస్ట్' టీమ్.. విష్వక్ సేన్ 'రీల్ ఛాలెంజ్' - ashokavanam lo arjuna kalayanam date
దళపతి విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాలోని ఓ పాటకు ఛాలెంజ్ విసిరారు కథానాయకుడు విష్వక్ సేన్.
అశోకవనంలో అర్జున కళ్యాణం:విష్వక్ సేన్ కథానాయకుడిగా విద్యాసాగర్ చింతా తెరకెక్కించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్ 22న విడుదల కానుంది. ఇప్పటికే 'ఉరికే నా సిలకా' అనే గీతం విడుదల కాగా.. ఆ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఈ పాటకు సంబంధించి ఛాలెంజ్ విసిరారు విష్వక్ సేన్. 'రామసిలకా రీల్ ఛాలెంజ్'లో భాగంగా ఈ పాట స్టెప్పును ఇంట్లో వాళ్లతో వేసి.. పంపితే అందులో కొందరిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వారిలో టాప్ టెన్‌లో నిలిచిన ఐదుగురు మహిళల ఇంటికి మధ్యాహ్నం.. లంచ్‌కు వస్తానని చెప్పారు. మొదటి నలభై మందికి తమతోపాటు 'ప్రసాద్ ఐమ్యాక్స్'లో సినిమా చూసే అవకాశాన్ని కల్పించనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో రాఖీ సావంత్ రచ్చ - వీడియో వైరల్