Vishal CBFC Allegations :ముంబయి సెన్సార్ బోర్డు కార్యాలయంలో అవినీతి పేరుకుపోయిందంటూ నటుడు విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజాగా స్పందించింది. ఈ విషయం చాలా దురదృష్టకరమని పేర్కొంది.
"సీబీఎఫ్‌సీలో జరిగిన అవినీతిపై నటుడు విశాల్ బయటపెట్టిన అంశం చాలా దురదృష్టకరమని మేము భావిస్తున్నాం. ఈ విషయంపై విచారణ జరిపేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఒక సీనియర్ అధికారిని ఈ రోజు ముంబయికి పంపాం. ప్రతి ఒక్కరూ మంత్రిత్వ శాఖకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. CBFC వేధింపులకు సంబంధించిన ఏదైనా విషయాలను గురించి సమాచారాన్ని తెలిపేందుకు jsfilms.inb@nic.inను ఉపయోగించుకోవల్సిందిగా కోరుతున్నాము". అని సమాచార మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా తెలిపింది.
'ఆ ఇద్దరూ CBFC వ్యక్తులు కారు'..
మరోవైపు ఇదే విషయంపై దర్శకుడు అశోక్ పండిట్ కూడా స్పందించారు. విశాల్ పేర్కొన్న ఆ ఇద్దరూ CBFC ఉద్యోగులు కారని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా విశాల్ చేస్తున్న ఆరోపణల తీవ్రత ఎక్కువగా ఉన్నందున.. ఈ విషయంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
"విశాల్ తన స్టేట్‌మెంట్‌లో ఎం రాజన్, జిజా రాందాస్ అనే ఇద్దరి పేర్లను ప్రస్తావించారు. నాకు తెలిసినంత వరకు వీరిద్దరూ CBFC ఉద్యోగులు కాదు. అటువంటప్పుడు ఈ విషయం గురించి సీబీఎఫ్‌సీ అధికారిని నిందించడం సరికాదు. కానీ మీరు చేసిన ఆరోపణలు చాలా సీరియస్‌గా ఉన్నందున.. ఈ విషయంపై మేము సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు డిమాండ్ చేసిన ఏ అధికారి కూడా నేరుగా అతని ఖాతాలోకి డబ్బులు వేయమని అడిగి ఉండడు. అయితే ఆయన పేర్కొన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైనా CBFC వ్యక్తుల తరఫున డబ్బులు తీసుకున్నారా అన్న విషయాన్ని వారిని అడిగే తెలుసుకోవాలి. దీని పై కచ్చితంగా హై పవర్ విచారణ చేపట్టాల్సిందే." అని అశోక్ అన్నారు.
అసలేం జరిగిందంటే :
Vishal Censor Board : కోలీవుడ్ హీరో విశాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు సెన్సార్ జారీ చేసే సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(Central Board of Film Certification) కార్యాలయంలోనూ అవినీతి పేరుకుపోయిందని ఆయన ఆరోపణలు చేశారు. తన లేటెస్ట్ మూవీ 'మార్క్ ఆంటోని' విషయంలో తనకు ఎదురైన సమస్య గురించి మాట్లాడిన ఆయన ఈ మేరకు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ పోస్ట్‌తో తన ఆవేదన వ్యక్తం చేశారు.
Kollywood Heroes Red Card : ఆ స్టార్ హీరోలకు బిగ్ షాక్!.. వారందరికి రెడ్ కార్డ్.. ఏం తప్పు చేశారంటే?
Vishal Censor Board : స్టార్ హీరో సంచలన వీడియో రిలీజ్.. సెన్సార్ బోర్డుకు రూ. 6 లక్షల లంచం!