తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విరాటపర్వం ట్రైలర్​ అదిరింది.. 'రుణం తీర్చుకోవాలంటే అదే మార్గం' - విక్రమ్​

రానా హీరోగా నటించిన 'విరాటపర్వం' ట్రైలర్​ రిలీజైంది. వెన్నెల పాత్రలో సాయిపల్లవి, రవన్న పాత్రలో రానాలను చూసుకుని ఫ్యాన్స్​ ఖుషీ అయిపోతున్నారు. మరోవైపు విక్రమ్​ సక్సెస్​పై ఆ సినిమా దర్శకుడు లోకేశ్​ కనకరాజ్​ భావోద్వేగ ట్వీట్​ చేశారు. దీనిపై స్పందించిన కమల్​ ఆసక్తికరమైన ట్వీట్​ చేశారు.

d
d

By

Published : Jun 5, 2022, 11:02 PM IST

యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్​ హీరోగా నటించిన చిత్రం 'విక్రమ్'.​ యువ దర్శకుడు లోకేశ్​ కనకరాజ్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్​ వస్తోంది. కమల్​, విజయ్​ సేతుపతి, ఫహద్​ ఫాజిల్​ నటన, సూర్య కేమియో, అనిరుధ్​ నేపథ్యసంగీతం.. కనకరాజ్​ దర్శకత్వం ప్రేక్షకులకు కట్టిపడేశాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి భావోద్వేగానికి గురైయ్యారు లోకేశ్.

"నేను ఈ స్థాయిలో ఎప్పుడూ భావోద్వేగానికి గురికాలేదు. విక్రమ్​ పట్ల​ మీరు చూపించిన ఆదరణ మర్చిపోలేనిది. మీరు చూపించిన ఈ ప్రేమకు ఎలా రుణం తీర్చుకోవాలో తెలియట్లేదు. కమల్​హాసన్​ సార్​కు.. ప్రజలకు కృతజ్ఞతలు." అని లోకేశ్​ ట్వీట్​ చేయగా.. అందుకు కమల్​ రిప్లై ఇచ్చారు.

"ప్రేక్షకుల ప్రేమకు రుణం తీర్చుకోవడానికి ఒక్కటే దారి ఉంది. నువ్వు ఎప్పుడూ నీ పనిపట్ల సంతృప్తి పడకు. ప్రతీసారి నిజాయతీగా మరింత కష్టపడు. దాని ఫలితమే వాళ్ల ఆదరణ, ప్రేమ. నా శక్తి కూడా వాళ్లే. రాజ్​కమల్​ నిర్మాణ సంస్థ నీకు ఎప్పుడూ అండగా ఉంటుంది."

-కమల్​ హాసన్​

రానా కథనాయకుడిగా నటించిన చిత్రం 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్​గా నటించింది. తాజాగా చిత్రబృందం రిలీజ్​ చేసిన ట్రైలర్​కు మంచి రెస్పెన్స్​ వస్తోంది. వెన్నెల పాత్రలో సాయిపల్లవి, రవన్న పాత్రలో రానాలను చూసుకుని ఫ్యాన్స్​ ఖుషీ అయిపోతున్నారు. ప్రేమ, విప్లవం అంశాలతో సాగిన ఈ ట్రైలర్​ నెటిజెన్లను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఈనెల 17న విడుదల కానుంది.

విక్టరీ వెంకటేష్​, మెగాహీరో వరుణ్​ తేజ్​ కథానాయకులుగా నటించిన చిత్రం 'ఎఫ్​3'. ఇటీవల రిలీజ్​ అయిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లు వందకోట్లను దాటాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.102 కోట్ల గ్రాస్​ వచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు ఎఫ్​3 హిట్​ అయిన జోష్​లో దర్శకుడు అనిల్​ రావిపూడి 'ఎఫ్​4'కు కథను సిద్ధం చేసే పనిలో పడ్డట్టు సమాచారం.

ఇదీ చూడండి :'అందుకే వాళ్లు జబర్దస్త్​కు దూరం'... ఒంటరినైపోయా అంటూ రాంప్రసాద్​ కన్నీరు

ABOUT THE AUTHOR

...view details