Virat Kohli Anushka Bike Ride: వారిద్దరూ స్టార్లు.. భార్యాభర్తలు.. ఎడతెరిపి లేని బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు. అయితే కొన్ని రోజులు విధుల నుంచి విరామం తీసుకుని సరదాగా గడిపిన ఆ ఇద్దరూ తాజాగా ఓ ఫొటో షూట్‌కు సిద్ధమైపోయారు. ఇంతకీ ఆ ఇద్దరు సెలబ్రిటీలు మరెవరో కాదు.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ. ఇందులో విశేషం ఏముందంటారా..? అయితే వారిద్దరూ తమ షూటింగ్ స్పాట్‌కు వచ్చిన విధానమే నెట్టింట్లో వైరల్‌గా మారింది.
లగ్జరీ కార్లను వదిలేసి మరీ స్కూటర్ మీద షికారు చేస్తూ ముంబయిలోని మధ్ ఐస్‌ల్యాండ్‌కు వచ్చేశారు. అయితే వీరిద్దరూ అభిమానుల నుంచి తప్పించుకునేందుకు హెల్మెట్లు పెట్టుకునీ మరీ రావడం విశేషం. స్కూటీ మీద వచ్చి షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత విరాట్-అనుష్క ఫొటోలకు పోజులిచ్చారు.