Bro pre release event : మరి రెండు రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సుప్రీం హీరో సాయి తేజ్ సందడి వాతావరణం నెలకొనబోతోంది. ఈ మామఅల్లుళ్లు కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా 'బ్రో' రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో పవన్ వింటేజ్ లుక్‌లో కనిపించనున్నారని... ఇప్పటికీ మూవీటీమ్ పోస్టర్లను రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులు.. ఈ సినిమా కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Pawan vintage song Killi killi : దీంతో పాటే.. మూవీటీమ్ మరో అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ కూడా చేసింది. అదే పవన్ వింటేజ్ సూపర్ హిట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేసింది. గతంలో.. గుడుంబా శంకర్ సినిమాలోని 'కిల్లి కిల్లి' సాంగ్‌తో పాటు 'వయ్యారి భామ', 'ఏదోలా ఉందీవేళ', 'సరిగమ పదనిస' వంటి హిట్ పాటలను మిక్స్ చేసి తమన్ బీట్ అందిస్తున్నట్లు ప్రచారం సాగింది. ఇప్పుడా ప్రచారాన్నే నిజం చేస్తూ.. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది.
గుడుంబా శంకర్ సినిమాలోని 'కిల్లి కిల్లి' సాంగ్‌ను రీమిక్స్ చేసినట్లు తెలిపుతూ.. అదిరిపోయే వీడియోను రిలీజ్ చేసింది. వీడియోలో పవన్.. వింటేజ్ కూలీ లుక్‌లో లుంగీ, ఎర్రచొక్క వేసుకుని మాస్ స్టెప్పులతో ఊగిపోయారు. అంతేకాకుండా ఈ పాటలో .. పవన్‌తో పాటు సాయితేజ్, తమన్ వేసిన మాస్ స్టెప్పులు కూడా ఫ్యాన్స్‌ను తెగ ఊర్రూతలూగించేశాయి. సాంగ్ బీటైటే వేరే లెవల్. ఇక దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ హాలంతా ఈలలు, గోలతో షేక్ అయిపోయింది.
ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో సోషల్‌మీడియాలో ఫుల్‌గా చక్కర్లు కొడుతోంది అభిమానుల్లో మరింత జోష్‌ను నింపుతోంది. అభిమానులైతే పండగ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే నిజానికి ఈ సినిమా నుంచి మొదట రిలీజ్ చేసిన రెండు సాంగ్స్‌కు అంతగా హైప్ రాలేదనిపించింది. సోషల్‌మీడియా అవి ఎక్కడా అంతగా కనిపించలేదు. ఆ పాటల విషయంలో, ముఖ్యంగా తమన్ అందించిన బీట్ విషయంలో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారని తెలిసింది.