Vijaydevarkonda Samantha movie starts: 'లైగర్' బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో స్పీడ్ పెంచారు. 'లైగర్' విడుదల కాకముందే.. పూరీతోనే మరో చిత్రం 'జనగణమన'ను పట్టాలెక్కించారు. ఇప్పుడు తాజాగా ఇంకో కొత్త ప్రాజెక్ట్‌ను ఓకే చేసి సెట్స్‌పైకి తీసుకెళ్లారు. 'మజిలీ', 'నిన్నుకోరి' వంటి సున్నితమైన ప్రేమకథలతో ప్రేక్షకులకు చేరువైన శివ నిర్వాణతో కలిసి సినిమా చేస్తున్నారు. గురువారం ఉదయం ఈ మూవీ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు హరీశ్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
విజయ్ దేవరకొండ 11వ ప్రాజెక్ట్‌గా సిద్ధమైన ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా కనిపించనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ 'మహానటి'లో కలిసి నటించి మెప్పించారు. మనసుని హత్తుకునే ప్రేమకథతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ కొత్త సినిమా రూపుదిద్దుకోనుందని, దీనికి 'ఖుషి' టైటిల్ పెట్టే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు.