Vijaydevarkonda samantha injured: విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఫీల్‌గుడ్ ప్రేమ కథా చిత్రం 'ఖుషి'. 'నిన్ను కోరి', 'మజిలీ' చిత్రాల ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తోంది. కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. తొలి షెడ్యూల్ కూడా పూర్తైంది. అయితే ఈ షెడ్యూల్ అంతా బాగానే జరిగినప్పటికీ.. ఓ చిన్న అనుకోని సంఘటన జరిగిందనే ప్రచారం జరిగింది. ఈ చిత్రీకరణలో భాగంగా ఓ స్టంట్ సన్నివేశంలో నటిస్తుండగా విజయ్, సామ్‌కు గాయాలు అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
స్టంట్ సీన్.. విజయ్-సామ్‌కు గాయాలు! - విజయ్ దేవరకొండ సమంత సినిమా లేటెస్ట్ న్యూస్
Vijaydevarkonda samantha injured: 'ఖుషి' సినిమా చిత్రీకరణలో భాగంగా ఓ స్టంట్ సన్నివేశంలో నటిస్తుండగా విజయ్-సమంత గాయపడినట్లు, వెంటనే వారికి ప్రాథమిక చికిత్స అందించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై 'ఖుషి' టీమ్ స్పందించింది.
స్టంట్ సీన్.. విజయ్-సామ్‌కు గాయాలు
అయితే అలాంటి ప్రమాదం ఏమీ జరగలేదని 'ఖుషి' టీమ్ ప్రకటించింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని చెప్పింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. టీం అంతా సక్సెస్ ఫుల్ గా కాశ్మీర్ లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్‌కు తిరిగి వచ్చినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానున్నట్లు.. పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: విజయ్‌తో లిప్‌లాక్!.. నిన్ను తలచుకుంటే నా పెదవులపై చిరునవ్వు: సమంత
Last Updated : May 24, 2022, 9:33 AM IST