ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో పోరాటం చేసే సైనికుల స్ఫూర్తి గాథలతో ఎన్నో సినిమాలు రూపొందాయి. దేశభక్తితోపాటు, వీరోచిత విన్యాసాలతో హీరోయిజాన్ని ఆవిష్కరించేందుకూ ఈ కథల్లో ఆస్కారం ఉంటుంది. నవతరం దర్శకులు వాటికితోడు కుటుంబ కథలు, ప్రేమకథలు, మాస్ కథల్నీ ఈ నేపథ్యంలోనే చెప్పే ప్రయత్నం చేస్తుండడం నేటి ట్రెండ్. 'వెంకీ మామ', 'సరిలేరు నీకెవ్వరు' తదితర చిత్రాలు ఆ కోవకి చెందినవే!
Vijaydevarkonda JGM movie: విజయ్ దేవరకొండ ఆర్మీ నేపథ్యంలో సాగే కథల్లోనే నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనగణమన’ చిత్రంలో విజయ్ ఆర్మీ అధికారిగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ చేయనున్న కొత్త చిత్రమూ ఆర్మీ నేపథ్యంలోనే సాగే రొమాంటిక్ ప్రేమ కథగా రూపొందుతున్నట్టు సమాచారం. ఇందులో కథానాయిక సమంత కశ్మీరీ యువతిగా కనిపించనున్నట్టు తెలిసింది.
Dulquersalman Sitaram movie: యువ దర్శకుడు హను రాఘవపూడి 'సీతారామం' పేరుతో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా ఓ ప్రేమకథని తెరకెక్కిస్తున్నారు. అది ఆర్మీ నేపథ్యంలో సాగే కథే. ఇందులో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటిస్తున్నారు. కశ్మీరీ యువతిగా కథానాయిక రష్మిక మందన్న నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది.
Nagachaitanya Lalsingh chaddha movie: 'వెంకీమామ'లో ఇప్పటికే జవాన్‌గా కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించిన నాగచైతన్య... ఆమిర్‌ఖాన్‌తో కలిసి నటించిన 'లాల్‌సింగ్ చద్ధా'లోనూ సైనికుడిగా మెరవనున్నారు. 'మేజర్' కోసం అడివి శేష్ యుద్ధవీరుడిగానే కనిపించనున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో 'మేజర్' రూపొందుతున్న సంగతి తెలిసిందే.