తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'లైగర్'​ సాంగ్​ రిలీజ్​.. విజయ్ మాస్​ ట్రీట్​ అదిరిందిగా! - లైగర్​ మాస్ సాంగ్ రిలీజ్​

Vijaydevarkonda Liger mass song released: విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం 'లైగర్‌'. తాజాగా ఈ సినిమాలోని తొలి గీతం 'అక్డీ పక్డీ'ని విడుదల చేసింది మూవీటీమ్​. ఇందులోని విజయ్‌ స్పీడ్‌ డ్యాన్స్‌ అందరినీ కట్టిపడేసేలా ఉంది. బీట్‌కు తగ్గట్టు ఆయన వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి.

Vijaydevarkonda Liger mass song released
Vijaydevarkonda Liger mass song released

By

Published : Jul 11, 2022, 4:45 PM IST

Vijaydevarkonda Liger mass song released: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'లైగర్'. అనన్య పాండే కథానాయిక. కరణ్ జోహర్, చార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ చిత్ర తొలి గీతం 'అక్డీ పక్డీ'ని తాజాగా విడుదల చేసింది. ఇందులోని విజయ్‌ స్పీడ్‌ డ్యాన్స్‌ అందరినీ కట్టిపడేసేలా ఉంది. బీట్‌కు తగ్గట్టు ఆయన వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. అనన్యపాండే విజయ్‌తో పోటీపడి నర్తించింది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది.

ఈ 'అక్డీ పక్డీ' పాటను లిజో జార్జ్‌ డిజె చేతాస్‌ స్వరపరచగా.. సునీల్‌ కశ్యప్‌ హుక్‌లైన్‌ అందించారు. అజీమ్‌ దయాని సూపర్‌ వైజ్‌ చేశారు. తెలుగులో భాస్కర భట్ల సాహిత్యమందించగా.. అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహరా సంయుక్తంగా ఆలపించారు. ఓ సారి 'లైగర్‌' డ్యాన్స్‌ చూసేయండి...

ఇదీ చూడండి: 7 years of baahubali: వైరల్​ అవుతున్న బాహుబలి ద బిగినింగ్​ ఫోటోలు

ABOUT THE AUTHOR

...view details