Liger First day collections ఎన్నో అంచనాల మధ్య ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'లైగర్'. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. గురువారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో 'లైగర్' సందడి కనిపించింది. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు 'లైగర్' ఎన్ని కోట్లు రాబట్టిందో చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ.33.12 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. బ్లాక్‌బస్టర్ లైగర్ అనే హ్యాష్ ట్యాగ్‌ని జత చేస్తూ ట్వీట్ చేసింది.
విజయ్‌దేవరకొండ లైగర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే - లైగర్ రివ్యూ
Liger First day collections సెన్సేషనల్ స్టార్ విజయ్‌దేవరకొండ నటించిన 'లైగర్' గురువారం విడుదలైంది. అనన్య పాండే హీరోయిన్. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే.

విజయ్‌దేవరకొండ లైగర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే
కాగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రాంలో అనన్య పాండే హీరోయిన్. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. సునీల్ కశ్యప్, విక్రమ్ మాంట్రోస్, తనిష్ భాగ్చి సంగీతమందించారు. సినిమాటోగ్రఫీ- విష్ణు శర్మ, ఎడిటింగ్- జునైద్ సిద్ధిఖీ. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మూవీ విడుదలైంది.
ఇదీ చూడండి: ఈ బాలీవుడ్ భామలు సూపర్ హాట్, ఓ లుక్కేయండి
Last Updated : Aug 26, 2022, 3:05 PM IST