Vijaydevarkonda comments on Sharukhkhan నటుడిగా మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు స్టార్ హీరో షారుక్ ఖాన్. ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన సినిమాపై ఉన్న ఆసక్తితో చిత్రసీమలోకి అడుగుపెట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని స్వదినియోగం చేసుకుంటూ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఆయన సినీప్రయాణం ఎంతో మంది నటులకు స్ఫూర్తిదాయకం. అందుకే ఆయన్ను అభిమానులు ముద్దుగా బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ అని పిలుచుకుంటారు. అయితే తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లైగర్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తనకు కూడా షారుకే స్ఫూర్తి అని చెప్పారు. దీంతో పాటే గతంలో కింగ్‌ఖాన్ చెప్పిన ఓ మాటను తప్పు అని తాను నిరూపిస్తానని చెప్పారు.
"షారుక్ ఖాన్ సక్సెస్ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. నన్ను ముందుకు నడిపించింది. ఆయన(షారుక్) చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేననే విషయాన్ని స్పష్టంగా తెలిసేలా చేసింది. ఉదాహరణగా తీసుకునేందుకు ఒక్క విజయవంతమైన వ్యక్తి చాలు కదా. నాకు గుర్తింపు లేనప్పుడు కూడా చాలా సినిమాలను రిజెక్ట్ చేశాను. నేనెప్పుడు ఏది చేసినా పెద్దదిగా ఉండాలనే కోరుకుంటాను. పెద్ద కలలనే కన్నాను. అప్పుడు చాలా మంది 'ఇలా చేస్తే నీకు అవకాశాలు రావు' అనేవారు. కానీ నాపై నాకు భారీ అంచనాలు ఉన్నాయి." అని విజయ్ అన్నారు.