తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఒకే ఏడాదిలో 18చిత్రాలు రిలీజ్- 20సినిమాల్లో పోలీస్​గా విజయ్​కాంత్​- అది తెలిస్తే నో రెమ్యునరేషన్​! - విజయ్​కాంత్​సినీ కెరీర్​

Vijayakanth Film Career : ప్రముఖ కోలీవుడ్‌ నటుడు విజయ్​కాంత్ తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన సినీ కెరీర్​ గురించి తెలుసుకుందాం.

vijayakanth film career
vijayakanth film career

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 9:56 AM IST

Updated : Dec 28, 2023, 10:24 AM IST

Vijayakanth Film Career : ప్రముఖ కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (71) ఇకలేరు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు తమిళనాడు చెన్నైలోని మియాట్‌ ఇంటర్నేషనల్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కెప్టెన్‌ మృతిపట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

విజయ్​కాంత్ కుటుంబనేపథ్యం
Vijayakanth Wiki : 1952 ఆగస్టు 25వ తేదీన తమిళనాడులోని మధురైలో విజయ్​కాంత్​ జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్​ విజయరాజ్‌ అళగర్‌స్వామి కాగా, చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్‌గా మారారు. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండియన్‌ సగప్తం, మధుర వీరన్‌ చిత్రాల్లో నటించారు.

150 సినిమాలు-రోజుకు 3షిఫ్ట్​లు!
Vijayakanth Movies List : విజయ్​కాంత్ తన 27 ఏళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. 1979లో ఇనిక్కుమ్‌ ఇలమై సినిమాలో విలన్ పాత్రతోనే సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు 150కుపైగా సినిమాల్లో నటించారు. మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు. కెరీర్ స్టార్టింగ్​లో పరాజయాలు అందుకున్న విజయ్​కాంత్ వరుస సినిమాలో దూసుకెళ్లారు. 1984లో విజయ్​కాంత్ నటించిన సినిమాలు 18 రిలీజ్ అవ్వడం విశేషం. 20కు పైగా చిత్రాల్లో పోలీస్​ అధికారిగా కనిపించారు. చివరగా ఆయన సగప్తం(2015)లో నటించారు.

రెమ్యునరేషన్ తీసుకునేవారు కాదట!
తన సినిమాల్లో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు విజయకాంత్‌. దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య చిత్రాలైనా, ద్విపాత్రాభినయం చేయాలన్నా విజయకాంత్‌ అందరికంటే ముందుండేవారు. కమర్షియల్‌ చిత్రాల్లోనూ సందడి చేసేవారు. ఇతరుల్లా కాకుండా ఆయన పారితోషికాన్ని ముందుగానే తీసుకునేవారుకాదట. తనతో సినిమా నిర్మించే నిర్మాతలు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యునరేషన్‌ తీసుకునేవారు కాదట.

కేవలం తమిళ సినిమాలే!
అయితే విజయ్​కాంత్ కేవలం తమిళ చిత్రాల్లోనే నటించారు. ఇతర భాషల్లో యాక్ట్ చేయలేదు. కానీ ఆయన నటించిన సినిమాలు తెలుగు, హిందీలో డబ్‌ అయి అక్కడా మంచి విజయాలు సాధించాయి. శివప్పు మల్లి (ఎర్ర మల్లెలు రీమేక్‌), జదిక్కొరు నీధి తదితర సినిమాల్లో నటించడంతో కోలీవుడ్‌లో ముందుగా ఆయన్ను పురాచీ కళింగర్‌ (విప్లవాత్మక నటుడు) అనేవారు. తర్వాత అభిమానులంతా కెప్టెన్‌ విజయకాంత్‌గా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఆయన వందో చిత్రం కెప్టెన్‌ ప్రభాకరన్‌ బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలవడమే అందుకు కారణం.ఒకానొక సమయంలో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లకు విజయకాంత్‌ గట్టి పోటీనిచ్చారు.

నిర్మాత, దర్శకుడిగా కూడా!
విజయకాంత్‌ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం విరుధగిరి. అందులో ఆయనే హీరో. తన బావ ఎల్‌.కె. సుధీశ్‌తో కలిసి వల్లారసు, నరసింహ, సగప్తం తదితర చిత్రాలను నిర్మించారు. 1994లో తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ ఆనరరీ అవార్డు (ఎంజీఆర్‌ పురస్కారం), 2001లో కలైమళి అవార్డు (తమిళనాడు ప్రభుత్వం) అందుకున్నారు. 2001లో బెస్ట్‌ ఇండియన్‌ సిటిజెన్‌ అవార్డు, 2009లో టాప్‌ 10 లెజెండ్స్‌ ఆఫ్‌ తమిళ్‌ సినిమా అవార్డు, 2011లో ఆనరరీ డాక్టరేట్‌ (ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చర్చ్‌ మేనేజ్‌మెంట్‌) పొందారు. పలు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు అందుకున్నారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ
Vijayakanth Political Career : ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు.

Last Updated : Dec 28, 2023, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details