అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ స్టార్ హీరో విజయ్ 'వారిసు' తమిళ, తెలుగు ట్రైలర్స్ వచ్చేశాయి. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం మాస్ అండ్ క్లాస్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. విజయ్ ఫ్యాన్స్ ఊహించినట్లే అన్ని కమర్షియల్ హంగులతో ఈ ప్రచార చిత్రం ఉంది. ఇందులో ఫ్యామిలీ బంధాలను చూపిస్తూనే విజయ్‌ను బిజినెస్‌మెన్‌గా చూపించారు. విజయ్ అటు క్లాస్‌గా కనిపిస్తూనే మాస్ ఫైట్స్‌తో ఇరగదీశారు. తన మార్క్ డ్యాన్స్‌లతో అగదిరిపోయే స్టెప్పులు వేశారు. యోగిబాబుతో కలిసి చేసిన కామెడీ కూడా బాగానే ఉంది. మొత్తంగా ఈ ట్రైలర్లో విజయ్ యాక్షన్ హైలైట్‌గా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ విపరీతంగా లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు.
Varisu trailer: తెలుగు ట్రైలర్ ఆగయా.. దళపతి క్లాస్ అండ్ మాస్ యాక్షన్ సూపరహే - విజయ్ వారసుడు ట్రైలర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో నటించిన వారిసు చిత్రం తెలుగు, తమిళ ట్రైలర్స్ వచ్చేశాయి. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం అదిరిపోయే సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.
కాగా, ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించారు. విజయ్ సరసన రష్మిక కథానాయికగా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రభు, శరత్ కుమార్, జయసుధ, ఖుష్బూ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలై ఈ చిత్ర పాటలు సోషల్‌మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తూ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.
ఇదీ చూడండి:అవికా గోర్ క్రేజ్ అట్లుంటది మరి.. పాన్ వరల్డ్ హీరోయిన్గా ఏకంగా 28 దేశాల్లో