తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దళపతి 67 'లియో' టీజర్.. విక్రమ్​, ఖైదీకి కనెక్షన్​​.. ఈ సీన్స్​ను కనిపెట్టారా? ​ - దళపతి 67 లియో టీజర్ విక్రమ్​

దళపతి 67 లియో టీజర్​ విడుదలై ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటోంది. ఇందులో సన్నివేశాలు చూస్తుంటే ఈ చిత్రం విక్రమ్​, ఖైదీకి కనెక్షన్​ ఉండేలా కనిపిస్తోంది. దాని గురించే ఈ కథనం..

Vijay thalaphy 67 Leo teaser decodes with vikram Khaidi
దళపతి 67 'లియో' టీజర్.. విక్రమ్​, ఖైదీకి కనెక్షన్​​..

By

Published : Feb 4, 2023, 1:09 PM IST

Updated : Feb 4, 2023, 1:47 PM IST

దర్శకుడు లోకేశ్ కనగరాజ్​ తెరకెక్కించబోతున్న 'దళపతి 67' టైటిల్ టీజర్ వీడియో​ విడుదలై ఫ్యాన్స్​కు గూస్​బంప్స్​ తెప్పించింది. 'లియో: బ్లడీ స్వీట్​' పేరుతో తెరకెక్కిన​ ఈ టీజర్​తో.. ఈ సినిమా లోకేశ్​ సినిమాటిక్​ యూనివర్స్​లో భాగమని అర్థమవుతోంది. ఈ చిత్రానికి..కమల్​ 'విక్రమ్​'కు కనెక్షన్​ ఉన్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్​ను డికోడ్​ చేస్తే నాలుగు విషయాలు అర్థమవుతున్నాయి. కానీ డికోడ్​ చేసే విషయం ముందు ఓ విషయాన్ని మాట్లాడుకోవాలి అదేంటంటే. లోకేష్​ తన సినిమాలో పాత్రలను సృష్టించేటప్పుడు ఆ పాత్రకు తగ్గటు ఓ పేరు పెట్టుకుంటారు. దాన్ని జంతువులతో పోలుస్తారు. 'విక్రమ్'లో కమల్​ అండ్​ ఆయన స్పై టీమ్​ను ఈగెల్​(గద్ద)తో పోల్చారు. అలానే ఈ చిత్రంలో సూర్య రోలెక్స్​ను స్కార్​పియో(తేలు)గా చూపించారు. అలాగే తాజాగా వచ్చిన టీజర్​లో విజయ్​ను లియో(సింహం)గా అభివర్ణించారు. ఇక విజయ్​ సేతుపతిని పాత్రను ఓ పాముతో కంపేర్​ చేశారు.

ఇక విషయానికొస్తే.. లియో టీజర్​ ప్రారంభంలో చూపించిన ఓ ఇల్లు, విక్రమ్​ టీజర్​ ప్రారంభంలో చూపించిన ఇల్లు ఓకేలా ఉంది. అంటే విజయ్​, కమల్​కు ఆ ఇంటితో కనెక్షన్​ ఉందని తెలుస్తోంది. ఆ ఇంట్లో వారిద్దరపై సన్నివేశాలు ఉండొచ్చు.

తాజా టీజర్​లో మార్నింగ్​ సీన్​లో ఓ గ్యాంగ్​ ముసుగులు వేసుకుని వెహికల్స్​లో వెళ్తుంటుంది. అదే సమయంలో ఓ గద్దను కూడా చూపించారు. అంటే అది విక్రమ్ సినిమాలో ముగుసు వేసుకునే కమల్ గ్యాంగ్ అని అర్థమవుతోంది. వారు​ ఎవరికోసమో వెతుకుతూ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అది విజయనే కూడా కావొచ్చు. మరి వీరిద్దరి మధ్యలో యాక్షన్​ సీన్స్​ ఉంటాయో లేదో చూడాలి.

విక్రమ్​ గ్యాంగ్​

ఈ గ్లింప్స్​లో నైట్ టైమ్​లో మరో గ్యాంగ్​ కారులో వెళ్తున్నట్లు చూపించారు. ఆ కార్స్​ను చూస్తుంటే.. విక్రమ్​ సినిమా క్లైమాక్స్​లోని రోలెక్స్​ గ్యాంగ్ కార్స్​లానే ఉన్నాయి. అంటే వీరు కూడా విజయ్​ కోసం వెతుకుతూ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

రోలెక్స్ గ్యాంగ్​

ఇకపోతే గతంలో ఖైదీ చిత్రంలోనూ హీరో కార్తి.. తాను ఓ బేకరిలో మూడేళ్ల పాటు పనిచేసినట్లు ఓ సన్నివేశంలో చెప్తాడు. ఇప్పుడు అలాంటి చాక్లెట్​ బెకరీలోనే విజయ్ కనిపిస్తున్నారు. అంటే ఈ హీరోలిద్దరు మధ్య సన్నివేశాలు ఉండే అవకాశం ఉంది.

ఖైదీ బేకరి

ఇంకా ఆ టీజర్​లో బేకరిలో విజయ్ చేసేది Erythoxylum డ్రగ్​ బిజినెస్ అని అర్థమవుతోంది​. అయితే విక్రమ్​ సినిమాలో కమల్​ తన ఇన్​వెస్టిగేషన్​లో భాగంగా ఓ సందర్భంలో ఈ డ్రగ్​ను కనిపెడతారు. మరో విషయమేమిటంటే ఈ ప్రోమోలో పామును చూపించారు. అయితే దాని తల తెగి పోతుంది. అంటే విజయ్​సేతుపతి పాత్ర చచ్చిపోయిందని, ఈ సినిమాలో ఉండకపోవచ్చని అర్థం.

డ్రగ్స్​

అలా లోకేష్​ యానివర్స్​లో భాగంగా ఖైదీ, విక్రమ్​.. దళపతి 67కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ సారి ఒకే తెరపై కమల్​, విజయ్​, సూర్య, కార్తి కనిపించే అవకాశాలు ఉన్నాయి. మరి వీరిందరినీ కలిపి లోకేశ్​ కథను ఎలా సిద్ధం చేస్తున్నారో చూడాలి.

మొత్తంగా.. ఈ ప్రోమో అభిమానులకు మంచి కిక్​ ఇచ్చింది. ఇందులో హీరో విజయ్ చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్​, ఖార్కానాలో ఇనుమును కరిగించి కత్తి ఏక కాలంలో తయారు చేస్తూ కనిపించారు. మరోవైపు ఓ గ్యాంగ్ ఆయన కోసం కారులో దూసుకొస్తూ కనిపించింది. అలా తన చాక్లెట్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన శత్రులతో పోరాడేందుకు విజయ్ చాక్లెట్​ పూసి ఉన్న కత్తిని పట్టుకొని సిద్ధంగా కనిపిస్తారు. అలా సినిమా థీమ్, హీరో క్యారెక్టరైజేషన్ తెలియజేస్తూ రూపొందించిన ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది.

ఇదీ చూడండి:హరిహర వీరమల్లు.. పవన్ కొత్త​ స్టిల్స్​ చూశారా?

Last Updated : Feb 4, 2023, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details