తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తమిళ స్టార్​​ డైెరెక్టర్​తో తారక్​ మూవీ!.. 'విజయ్​ 66' అదిరే అప్డేట్​ - latest movie updates

Movie Updates: మిమ్మల్ని పలకరించేందుకు సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో హీరోలు జూనియర్​ ఎన్టీఆర్, విజయ్​, ఆకాశ్​ పూరి చిత్రాలకు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

vijay tARAK
vijay tARAK

By

Published : Jun 19, 2022, 6:45 PM IST

Jr. NTR Movie Tamil Director Vetrimaaran: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. 'ఆర్ఆర్ఆర్' స‌క్సెస్​ను ఎంజాయ్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే కొర‌టాల శివ దర్శకత్వంలో చేయ‌బోయే కొత్త సినిమా షురూ చేసేందుకు రెడీ అవుతున్నారు. మ‌రోవైపు 'కేజీఎఫ్' ఫేమ్​ ప్ర‌శాంత్‌నీల్‌తో 'ఎన్టీఆర్ 31' ప్రాజెక్ట్​ కూడా చేయనున్నారు. ఇదిలా ఉంటే తార‌క్.. మ‌రో సినిమాకు సంబంధించిన వార్త ఒక‌టి నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ఎన్టీఆర్​.. ఈ సారి అవార్డు విన్నింగ్ త‌మిళ డైరెక్ట‌ర్​తో సినిమా చేయ‌బోతున్నారట.

త‌మిళంలో ప‌లు అవార్డు విన్నింగ్ సినిమాలను ప్రేక్ష‌కుల‌కు అందించిన వెట్రిమార‌న్​తో సినిమా చేసేందుకు తార‌క్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారట. ఇటీవ‌లే ఓ స్టోరీలైన్‌ను వెట్రిమార‌న్ వినిపించ‌గా ఎన్టీఆర్‌కు బాగా న‌చ్చింద‌ట‌. పూర్తి స్కిప్ట్‌తో రావాల‌ని సూచించారట. మ‌రి ఈ క్రేజీ కాంబినేష‌న్‌పై రాబోయే రోజుల్లో ఏదైనా అప్డేట్​ వ‌స్తుందేమో చూడాలి.

తమిళ డైరెక్టర్​ వెట్రిమారన్​

Vijay Thalapathy 66 Movie First Look: కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్.. తనకంటూ సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మిగతా స్టార్స్​తో పోల్చుకుంటే ఆయన ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా విడుదల చేస్తున్నారు. 2019లో 'బిగిల్'తో భారీ హిట్ కొట్టిన విజయ్.. మాస్టర్ మూవీతో విజయ పరంపర కొనసాగించారు. ఇటీవలే విడుదలైన 'బీస్ట్' మాత్రం నిరాశపరిచింది.

'విజయ్​ తలపతి 66' ఫస్ట్​లుక్​ అప్టేట్​

ఇక ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే దర్శకుడు వంశీ పైడిపల్లితో విజయ్ మూవీ ప్రకటించారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్​రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ మొదలు కాగా.. ఫస్ట్ లుక్​ను విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్​. జూన్ 22న విజయ్ బర్త్​డే. దీన్ని పురస్కరించుకుని ఫస్ట్​లుక్ జూన్ 21న సాయంత్రం 6:01 నిమిషాలకు విడుదల చేయన్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో హీరోయిన్​గా రష్మిక నటిస్తున్నారు.

ఆకాశ్​పూరి 'చోర్​ బజార్​'
అఖిల్​ 'ఏజంట్​'
'7 డేస్​ 6 నైట్స్​' ట్రైలర్​ అప్డేట్
'విక్రాంత్​ రోణా' ట్రైలర్​ అప్డేట్​

ఇవీ చదవండి:సామ్​, చరణ్​, తారక్​లతో 'కాఫీ విత్​ కరణ్'!..​ ఏడో సీజన్​ అప్పటి నుంచే..

ఓటీటీలోకి అందాల భామ ఎంట్రీ.. యాక్షన్​ కింగ్​ దర్శకత్వంలో విశ్వక్​సేన్​!

ABOUT THE AUTHOR

...view details