Vijay Sethupathi Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటీఫుల్ భామ రష్మిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పుష్ప'. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో భాగంపై అంచనాలు పెరిగిపోయాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. రెండో భాగం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు డైరెక్టర్ సుకుమార్. అయితే.. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో, ప్రత్యేక పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్న విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే.. విజయ్ సేతుపతి పుష్ప-2 లో నటించడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మీడియాలో వచ్చేవన్ని ఊహాగానాలేనని కొట్టిపారేశాయి. ప్రస్తుతం షారుక్ ఖాన్, నయన తార ప్రధాన పాత్రల్లో అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాలో మాత్రమే విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. ఇతర తెలుగు సినిమాల్లో ఎలాంటి నెగెటివ్ రోల్స్ చేయట్లేదని స్పష్టం చేశారు. దీనిని బట్టి విజయ్ సేతుపతి.. పుష్ప-2లో నటించట్లేదని అర్థం అవుతోంది. అయితే.. ఏమైనా అధికారిక ప్రకటన వస్తుందేమో వేచిచూడాలి.