ఈ ఏడాది సంక్రాంతికి సిద్ధమైన సినిమాల్లో విజయ్ హీరోగా నటించిన 'వారిసు' ఒకటి. ఈ సినిమాను తెలుగులో 'వారసుడు' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదోఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొదట ఈ సినిమాను జనవరి 12న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే, ఈ సినిమా విడుదల విషయంలో చిత్ర నిర్మాత దిల్‌రాజు సడెన్‌గా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. విడుదల తేదీని ఒకరోజు ముందుకు జరిపారు. జనవరి 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
'వారసుడు' విడుదలపై నిర్ణయం మార్చుకున్న దిల్‌రాజు.. రిలీజ్ ఎప్పుడంటే? - వారసుడు మూవీ రిలీజ్‌పై నిర్ణయం మార్చుకున్న దిల్
విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం వారసుడు. ఈ సినిమా విడుదల తేదీని మార్చుతున్నట్లు చిత్ర నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. ఎప్పుడంటే?
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సోషల్‌మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన ఈ పాటలు తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూవ్స్‌తో రికార్డులు సృష్టించాయి. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. కేవలం గంటలోనే 5మిలియన్ల వీక్షణలు అందుకుని 24గంటల్లోపే 20మిలియన్ల వీక్షణలు సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
ఇక అదే రోజున తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన తునివు (తెలుగులో తెగింపు) సినిమా కూడా రిలీజ్ అవుతుండడంతో ఈ రెండు సినిమాలకు తమిళంలో పోటీ తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఈ రెండు సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సినిమాల సరసన ఈ రెండు డబ్బింగ్ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవ్వనున్నాయి. మరి వాటికి పోటీ ఇస్తాయో లేదో తెలియాలంటే వేచిచూడాల్సిందే.