కమల్‌హాసన్ నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'విక్రమ్'. లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. ఈ సినిమా 3న విడుదలకానున్న నేపథ్యంలో కమల్‌హాసన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మలేషియా వెళ్లిన ఆయన.. అక్కడి మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా 'విక్రమ్' సీక్వెల్ చిత్రంలో దళపతి విజయ్ నటిస్తారా? అనే ప్రశ్న ఎదురవగా "ఆ సీక్వెల్ కోసం ఇప్పటికే ఓ స్టార్ హీరోను ఎంపిక చేశా. అతనెవరో మీకు బాగా తెలుసు (సూర్య)" అని బదులిచ్చారు. 'భవిష్యత్తులో మీరు కలిసి నటించే అవకాశాలున్నాయా?' అని అడగ్గా తమ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్.. విజయ్‌తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. విజయ్ కాల్షీట్ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చిత్రాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు.
'విక్రమ్' సీక్వెల్‌లో విజయ్.. కమల్‌హాసన్ క్లారిటీ - కమల్‌హాసన్ విక్రమ్ సీక్వెల్ లో విజయ్
'విక్రమ్' సీక్వెల్‌లో విజయ్ నటిస్తారా అనే ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు నటుడు కమల్‌హాసన్. భవిష్యత్‌లో ఆయనతో కలిసి నటించే అవకాశంపై కూడా మాట్లాడారు.
'విక్రమ్' సీక్వెల్‌లో విజయ్
కమల్‌కు ఇది 232వ సినిమా. సుమారు 4 ఏళ్ల తర్వాత ఆయన నటించిన చిత్రం కావడం, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషించడం, సూర్య అతిథి పాత్రలో కనిపించబోతుండటంతో 'విక్రమ్'పై భారీ అంచనాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.
ఇదీ చూడండి:చిరు-బాబీ సినిమాలో విలన్‌గా విజయ్‌సేతుపతి!