Beast Trailer: అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న తమిళస్టార్ దళపతి విజయ్ 'బీస్ట్' ట్రైలర్ విడుదలైంది. ఉగాది పర్వదినం సందర్భంగా దాదాపు 2:56 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉన్న ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్ అదుర్స్ అనిపించేలా ఉంది. విజయ్ను మరో లెవల్లో చూపించారు దర్శకుడు. ట్రైలర్.. సినిమాపై అంచనాలు మరింత పెంచిందనే చెప్పాలి. డైలాగ్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. 'రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని' అన్న డైలాగ్ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచింది.
Beast Trailer: రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని అంటున్న విజయ్ - beast release date
Beast Trailer: తమిళ స్టార్ 'దళపతి' విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్'. ఈ సినిమా ట్రైలర్‌ను ఉగాది సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం.
![Beast Trailer: రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని అంటున్న విజయ్ vijay in as beast trailer release](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14910661-thumbnail-3x2-beast.jpg)
బీస్ట్ ట్రైలర్
ఉగ్రవాదం నేపథ్యం చుట్టూ ఈ సినిమా కథ ఉంటుందని ట్రైలర్‌ను చూస్తే.. అర్థం అవుతుంది. గతంలో విజయ్ స్లీపర్ సెల్స్ కథాంశంతో తెరకెక్కిన తుపాకీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు విజయ్. ఈ సినిమా కూడా అంతకుమించిన హిట్‌గా నిలుస్తుందంటున్నారు అభిమానులు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ నిర్మించింది. అనిరూధ్ రవిచందర్ సంగీతం అందించారు. పూజా హెగ్డే హీరోయిన్. ఏప్రిల్ 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం.
Last Updated : Apr 2, 2022, 10:41 PM IST