తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సమంతతో ప్రేమలో పడ్డా.. ఇప్పుడైతే ఏకంగా..'.. విజయ్ షాకింగ్ ట్వీట్! - విజయ్ లేటెస్ట్ మూవీ

నటి సమంతపై హీరో విజయ్‌ దేవరకొండ ప్రశంసలు కురిపించాడు. ఎంతో కాలం నుంచి ఆమెను అభిమానిస్తున్నట్లు తెలిపాడు. ఆమెను సిల్వర్‌ స్క్రీన్‌పై చూసి ప్రేమలో పడిపోయానని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త వైరల్​గా మారింది.

Vijay Deverakonda
విజయ్ దేవరకొండ

By

Published : Oct 29, 2022, 7:51 AM IST

సమంతపై తన ఇష్టాన్ని బయటపెట్టారు నటుడు విజయ్‌ దేవరకొండ. ఎంతో కాలం నుంచి ఆమెను అభిమానిస్తున్నట్లు పేర్కొన్నాడు. సామ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'యశోద' ట్రైలర్‌ విడుదల చేసిన విజయ్‌ దేవరకొండ ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. "కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు మొదటిసారి ఆమెను సిల్వర్‌ స్క్రీన్‌పై చూసి ప్రేమలో పడిపోయాను. ఇక, ఇప్పుడైతే అన్ని విధాలుగా ఆమెను ఆరాధిస్తున్నా" అని అన్నాడు.

ఈ ట్వీట్‌ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన సినీ ప్రియులు.. 'మీ ఇద్దరి జోడీని మరోసారి స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్నాం', 'ఖుషి అప్‌డేట్‌లు ఇవ్వండి అన్నా', 'ఆన్‌స్క్రీన్‌లో మీ పెయిర్‌ బాగుంటుంది' అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక, 'మహానటి' తర్వాత విజయ్‌ దేవరకొండ - సమంత కాంబోలో సిద్ధమవుతోన్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకుడు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ టైటిల్‌ పోస్టర్‌, మేకింగ్‌ వీడియోలు సామ్‌-విజయ్‌ అభిమానులను ఆకట్టుకున్నాయి.

'యశోద' విషయానికి వస్తే.. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. సరోగసీ పేరుతో అన్యాయాలకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులపై సామ్‌ చేసే పోరాటాలను చూపిస్తూ తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. హరి-హరీశ్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:'పాన్ వరల్డ్ నాయికగా ఎదగాలనుకుంటున్నా'

ఈ అమాయకపు చూపుల చిన్నారి.. ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. తెలుసా?

ABOUT THE AUTHOR

...view details