LIGER movie business: విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. పూరీ తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడింది. బాక్సింగ్ నేపథ్యంలో చిత్రం తెరకెక్కడం, మాజీ ప్రో బాక్సర్ మైక్ టైసన్ సినిమాలో కీలక పాత్ర చేయడం వల్ల.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు లైగర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్‌ను నిరూపిస్తూ.. లైగర్ భారీగా ప్రీ బిజినెస్ చేస్తోంది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ భారీ స్థాయికి అమ్ముడయ్యాయి! సుమారు రూ.200 కోట్ల బిజినెస్ జరిగిందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
LIGER pre biz: సినిమా సంగీత హక్కులను సోనీ సంస్థ రూ.14 కోట్లకు కొనుగోలు చేసిందట. ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రూ.65 కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా మంచి రేటుకు కొనేసిందట. థియేట్రికల్ రైట్స్ సైతం భారీ రేటుకే అమ్ముడయ్యాయని సమాచారం చక్కర్లు కొడుతోంది. ఏపీ, నైజాంలో కలిపి ఈ సినిమా రూ.75 కోట్లకు అమ్ముడైందని ఇండస్ట్రీ వర్కాలు కోడై కూస్తున్నాయి. హిందీ వెర్షన్ రూ.25 కోట్లకు విక్రయించారట. కర్ణాటక రూ.7 కోట్లు, తమిళనాడు-కేరళ రూ.8కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.10 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. మొత్తంగా థియేట్రికల్ బిజినెస్ రూ.120 కోట్లకు పైగా జరిగిందట. విజయ్ దేవరకొండతో పాటు, పూరీ జగన్నాథ్‌కు ఇదే తమ కెరీర్ బెస్ట్ బిజినెస్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.