Brahmastra 2 Update: బాలీవుడ్ నుంచి విడుదలైన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ నటీనటులు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మొదటి భాగం విడుదలై మంచి టాక్ అందుకుంది. ప్రస్తుతం ఓటీటీ వేదికగా సినీ ప్రియులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో 'బ్రహ్మాస్త్ర-2'పై చిత్రబృందం దృష్టి పెట్టింది. శివ (రణ్‌బీర్‌కపూర్) గతాన్ని, అతడి తల్లిదండ్రుల గురించి, సినిమాలోని మెయిన్ విలన్ (దేవ్)ను ఇందులో చూపించనున్నట్లు సమాచారం. అందుకోసం నటీనటులను వెతికే పనిలో పడింది 'బ్రహ్మస్త్ర' టీమ్.
'బ్రహ్మస్త్ర-2' క్రేజీ అప్డేట్.. రణ్‌బీర్ పేరెంట్స్‌గా దీపికా పదుకుణె, విజయ్ దేవరకొండ!
బీటౌన్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న 'బ్రహ్మస్త్ర-2'లో రణ్‌బీర్ తండ్రిగా రౌడీ హీరో విజయ దేవరకొండ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రణ్‌బీర్ తల్లి పాత్రను స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణె పోషిస్తున్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. ఆ సంగతులు..
అయితే రణబీర్ కపూర్ తల్లి అమృత పాత్రను ఎవరు పోషిస్తారనే ఊహాగానాలకు ఈ సినిమా ఓటీటీ వెర్షన్ క్లారిటీ ఇచ్చేసిందట. ఇంటర్వెల్ తర్వాత సీన్లో దీపికా పదుకుణె.. శిశువును చేతిలో పట్టుకున్న సీన్‌ను నెటిజన్లు గుర్తించారని తెలుస్తోంది. 'బ్రహ్మస్త్ర-1'లోని దీపిక గ్లింప్స్ అంటూ పలువురు నెటిజన్లు ఈ చిన్న వీడియోను షేర్ చేస్తున్నారు. పార్ట్ 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పుడు అది పక్కన పెడితే.. సినిమాలో మెయిన్ విలన్‌గానే కాకుండా రణ్‌బీర్ తండ్రి పాత్రలో దీపికకు జోడీగా విజయ్ దేవరకొండ కనిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న నటుడిని దేవ్ పాత్రలో చూపిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. ఈ మేరకు విజయ్ దేవరకొండ అయితే ఈ రోల్‌కు సరైన న్యాయం చేయగలరని, అలాగే, ఆయన్ని తమ టీమ్‌లోకి చేర్చుకుంటే దక్షిణాదిలోనూ తమ సినిమాకి పాపులారిటీ వస్తుందని నిర్మాత కరణ్ జోహార్, చిత్ర దర్శకుడు అయాన్ అనుకున్నారని, దీంతో విజయ్‌ను సంప్రదించారట.