టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి తెలిసిందే. సినిమా విజయాపజయాలతో సంబంధం లేకుండా.. కేవలం యాటిట్యూడ్.. స్టైల్.. వాయిస్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తొలి చిత్రంతోనే తన నటనతో అలరించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యాడు. అయితే ఇటీవలే లైగర్‌తో భారీ పరాజయాన్ని అందుకున్న అతడితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఏమాత్రం వెనకాడటం లేదు. రీసెంట్గా రౌడీ హీరో.. గౌతమ్ తిన్ననూరితో సినిమా కోసం చర్చలు జరిపారట. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
రౌడీ హీరో క్రేజే వేరబ్బా.. బాలీవుడ్ నుంచి మరో రెండు మెగా ఆఫర్లు! - విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ నుంచి మరో రెండు మెగా ఆఫర్లు వచ్చాయని తెలిసింది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఆ వివరాలు..
అయితే ఈ హీరోకు మరో రెండు బంపర్ ఆఫర్లు వచ్చాయని తెలిసింది. బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని టాక్. బీటౌన్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ నిర్మాతలు విజయ్‌ను సంప్రదించారట. కరణ్ జోహార్ ఓ దర్శకుడితో కలిసి ఇటీవల విజయ్‌తో సినిమా గురించి మాట్లాడారని సమాచారం. మరో అగ్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ విజయ్‌తో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు ప్లాన్ చేస్తోందట. ఇంకా ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘‘ఖుషి’’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన అగ్ర కథానాయిక సమంత నటిస్తోంది. ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమాపై విజయ్ అభిమానులు ఇప్పటికే భారీస్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.
ఇదీ చూడండి:ఈ ముద్దుగుమ్మల అదిరిపోయే పోజులు చూశారా