తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ముంబయిలో గ్రాండ్‌ పార్టీ.. సౌత్​ నుంచి రష్మిక-విజయ్‌కు మాత్రమే ఎంట్రీ! - కరణ్​ జోహార్​ బర్త్​డే పార్టీ

Vijaydevarkonda Rashmika: ముంబయిలో జరగనున్న ఓ గ్రాండ్‌ పార్టీకి దక్షిణాది నుంచి హీరో విజయ్‌ దేవరకొండ, నటి రష్మికకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో వీరిద్దరూ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ కానున్నారని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇంతకీ, వీరిద్దరూ పాల్గొనే పార్టీ ఏమిటంటే?

vijay devarkonda rashmika grand party
విజయ్ రష్మిక గ్రాండ్ పార్టీ

By

Published : May 25, 2022, 4:49 PM IST

Vijaydevarkonda Rashmika: బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్​ పుట్టినరోజు నేడు(మే 25). క్లాస్‌ ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించి నిర్మాత, దర్శకుడిగా బాలీవుడ్‌కి ఎంతోమంది నటీనటులు, దర్శకులను పరిచయం చేశారు. ఆయన ఇప్పుడు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారట.

కరణ్‌ మిత్రులు, సినిమా పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్‌కు మాత్రమే ఆహ్వానం అందినట్లు సమాచారం. దీని ప్రకారం.. షారుఖ్‌ ఖాన్‌, ఆయన సతీమణి గౌరీ ఖాన్‌, మలైకా-అర్జున్‌ కపూర్‌, కరీనాకపూర్‌-సైఫ్‌ అలీఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఆయాన్‌ ముఖర్జీ, మనీశ్‌ మల్హోత్ర, రణ్‌వీర్‌ సింగ్‌, అనన్యపాండే, జాన్వీకపూర్‌, సారా అలీఖాన్‌ ఇందులో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌ సినిమా షూట్‌ కోసం విదేశాలకు వెళ్లిన ఆలియాభట్‌, కేన్స్‌ ఫెస్టివల్స్‌లో

ఉన్న దీపిక.. ఈరోజు సాయంత్రానికి నగరానికి చేరుకుని ఈ బర్త్‌డే వేడుకల్లో పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక, దక్షిణాది నుంచి విజయ్‌ దేవరకొండ, రష్మికలకు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందినట్లు సమాచారం.

ఇదీ చూడండి: ఆయన అంటే ఎప్పటినుంచో క్రష్​: రష్మిక

ABOUT THE AUTHOR

...view details