Vijay devarkonda Liger second song: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'లైగర్' సినిమా నుంచి సెకండ్ సాంగ్ విడుదలైంది. 'వాట్ లగా.. ' అంటూ సాగే ఈ పాట.. విజయ్ మాస్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటోంది. "వి ఆర్ ఇండియన్స్. మేము ఎవరికీ తీసిపోం. సోదరి నాతో రా.. మనం వెళ్దాం.. పోరాటం చేద్దాం" అంటూ పాట ప్రారంభంలో విజయ్ ఆగ్రహంతో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒకటిన్నర నిమిషంపాటు సాగిన ఈ వీడియో సాంగ్‌లో విజయ్.. తన ప్రత్యర్థిపై పోరాటం చేస్తున్న దృశ్యాలు చూపించారు.
Liger: మాస్ డైలాగ్స్‌తో సెకండ్ సాంగ్.. విజయ్ మళ్లీ అదరగొట్టేశాడుగా! - విజయ్ దేవరకొండ సెకండ్ సాంగ్ రిలీజ్
Vijay devarkonda Liger second song: 'లైగర్' సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. ఈ చిత్రంలోని రెండు పాట విడుదలై ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. పూరీ జగన్నాథ్ దర్శకుడు. ఇందులో విజయ్ ముంబయి మురికివాడకు చెందిన యువకుడిగా, ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన పాత్ర నత్తితో ఇబ్బందిపడే వ్యక్తిగా రూపుదిద్దుకుంది. ఆయన తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. అనన్యా పాండే కథానాయిక. మైక్ టైసన్ కీలకపాత్ర పోషించారు. విజయ్ దేవరకొండ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆగస్టు 25న విడుదల కానుంది.
ఇదీ చూడండి: రష్మికతో రిలేషన్.. ఎట్టకేలకు విజయ్‌దేవరకొండ ఓపెన్ అయ్యాడుగా!