తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దీక్ష విరమించిన 'లైగర్' ఎగ్జిబిటర్లు - దీక్ష విరమించిన లైగర్‌ ఎగ్జిబిటర్లు

'లైగర్‌' సినిమా నైజాం ఎగ్జిబిటర్లు గురువారం దీక్షను విరమించారు. పూరీ, ఛార్మి తమకు త్వరగా న్యాయం చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

liger exhibitors stopped their dharna
దీక్ష విరమించిన 'లైగర్' ఎగ్జిబిటర్లు

By

Published : May 18, 2023, 7:49 PM IST

Updated : May 18, 2023, 7:55 PM IST

డైరెక్టర్​ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'లైగర్‌'. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో పడిన తర్వాత బాక్సాఫీస్​ వద్ద భారీ డిజాస్టర్​గా నిలిచింది. వసూళ్లను అందుకోవడంతో దారుణంగా విఫలమైంది. దీంతో ఈ సినిమా వల్ల తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటూ నైజాం ఎగ్జిబిటర్లు మరోసారి తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఎదుట గత శుక్రవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే తాజాగా గురువారం వాళ్లు తమ ధర్నాను విరమించుకున్నారు. నిర్మాతల మండలి అలాగే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హామీ ఇవ్వడం వల్లే తాము ఈ ధర్నాను నిలిపివేస్తున్నామని చెప్పారు. పలువురు ఎగ్జిబిటర్ల అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తాము ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఛార్మి, పూరీ జగన్నాథ్‌ త్వరలోనే తమకు న్యాయం చేస్తారని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

కాగా, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్‌' చిత్రంలో అనన్యా పాండే హీరోయిన్​. పూరీ కనెక్ట్స్‌, ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఛార్మి, పూరీ జగన్నాథ్‌, కరణ్‌ జోహార్‌ కలిసి చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోన పరాజయాన్ని అందుకోవడంతో... 'లైగర్‌' చిత్రాన్ని కొనుగోలు చేసి తాము నష్టపోయామంటూ నైజాం ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గతంలో పూరీ ఇంటి వద్ద ధర్నా కూడా చేశారు. అప్పుడు విషయం తెలుసుకున్న పూరి.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని మాట కూడా ఇచ్చారు. కానీ ఆరు నెలలైనా పూరీ వారికి ఎలాంటి డబ్బు ఇవ్వలేదు. దీంతో ఎగ్జిబిటర్లు మళ్లీ రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. ఇక విషయం తెలుసుకున్న నటి, నిర్మాత ఛార్మి .. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని, డబ్బు అందచేస్తానని చెబుతూ.. ఫిల్మ్‌ ఛాంబర్‌కు మెయిల్‌ కూడా పంపింది.

ఇక పూరి జగన్నాథ్ విషయానికొస్తే.. లైగర్ ఫ్లాప్ తర్వాత ఆయనతో సినిమా చేసేందుకు హీరోలు, నిర్మాతలు వెనకడుగు వేశారని జోరుగా ప్రచారం సాగింది. విజయ్​ దేవరకొండ 'జనగనమణ' కూడా దాదాపు ఆ కారణంగానే నిలిచిపోయింది. అలా ఎనిమిది నెలల పాటు బ్రేక్​ తీసుకుని రీసెంట్​గా కొత్త సినిమాను ప్రకటించారు. ఎనర్జిటిక్​ స్టార్​ రామ్​ పోతినేనితో తన తదుపరి చిత్రం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు 'డబుల్ ఇస్మార్ట్' అనే మూవీని తెరకెక్కిస్తున్నట్లు సోషల్​మీడియా వేదికగా తెలిపారు.

ఇదీ చూడండి:Bichagadu 2 : 'ఇదేం టైటిల్'​ అన్నారు.. కట్​ చేస్తే సంచలనం.. మరి ఇప్పుడేం చేస్తుందో?

Last Updated : May 18, 2023, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details