దేశవ్యాప్తంగారౌడీ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న ఆయన.. తాజాగా మరో మంచి పని చేసేందుకు ముందుకు వచ్చారని తెలిసింది. మరణించిన తర్వాత మరో నలుగురికి తన దేహం ఉపయోగపడేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
టాక్ ఆఫ్ ది టౌన్‌గా విజయ్ దేవరకొండ.. ఆ ప్రకటనతో ఎంతో మందికి స్ఫూర్తిగా! - విజయ్ దేవరకొండ డొనేట్ ఆర్గన్
విజయ్ దేవరకొండ తాజాగా ఓ ప్రకటన చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే?
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన విజయ్.. తన అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. మరణించిన తర్వాత ఆర్గాన్స్ డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆర్గాన్స్ డొనేషన్‌కు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా, విజయ్ ఇటీవలే లైగర్ సినిమాతో కెరీర్లో బిగ్ ఫ్లాప్ అందుకున్నారు. ప్రస్తుతం హీరోయిన్ సమంతతో కలిసి 'ఖుషీ' సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ 'బ్రహ్మాస్త్ర' చిత్రంలోనూ ప్రతినాయకుడిగా నటిస్తారని ప్రచారం సాగుతోంది.
ఇదీ చూడండి:అబ్బబ్బ ఏమి అందాలు టూ మచ్ హాట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్నారుగా