Vijay Devarkonda Samanhta Birthday celebrations: కశ్మీర్‌లో రౌడీహీరో విజయ్ దేవరకొండ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. యూనిట్ సభ్యుల సమక్షంలో దేవరకొండ కేక్ కట్ చేశారు. సినిమాలో కథానాయికగా నటిస్తున్న సమంత, నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్, దర్శకుడు శివ నిర్వాణ, విజయ్ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి ఈ వేడుకలో పాల్గొన్నారు. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా హీరోయిన్ సమంత, దర్శకుడు పూరి జగన్నాథ్, అనన్య పాండే విజయ్ దేవరకొండకు ట్విట్టర్‌లో స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఇక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, వీడియోలతో రౌడీ స్టార్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ -పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లైగర్' సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. లైగర్ విడుదల కాకముందే విజయ్, పూరి కలిసి 'జన గణ మన' ప్రాజెక్టును లైన్‌లో పెట్టారు. దీంతో పాటు ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి లవ్ అండ్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు.
Yash dubbing movie Santu Straight forward: ఇతర భాషల హీరోల సినిమాలు హిట్ అయితే ఆ కథనాయకులకు సంబంధించిన పాత చిత్రాల డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ అవ్వడమే సహజమే. అలా ఈ సారి కేజీఎఫ్ హీరో యశ్.. 'రారాజు'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహేష్ రావు దర్శకత్వంలో యశ్, ఆయన భార్య రాధికా పండిట్ జంటగా నటించిన 'సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్' కన్నడ నాట మంచి హిట్ అయ్యింది. 'కిక్' ఫేమ్ శ్యామ్, సీత, రవిశంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ అవుతుందని దనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.