Vijay devarkonda Ananya pandey dance video: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా ప్రేక్షకాదరణ పొందిన సెలబ్రిటీ చాట్ షో 'కాఫీ విత్ కరణ్'. 6 సీజన్లపాటు సాగిన ఈ షో.. రానున్న రోజుల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో కరణ్ షోలో పాల్గొనే సెలబ్రిటీల జాబితా నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ-రష్మిక ఉన్నారంటూ మొన్నటిదాకా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడీ షోలో విజయ్-అనన్య షోలో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూట్ కూడా పూర్తైందంటూ, సెట్‌లో విజయ్ సంతకం చేసిన ఓ కాఫీ కప్ ఫొటో అంటూ సోషల్‌మీడియాలో ప్రచారం సాగుతోంది. మరోవైపు అనన్య.. తన ఇన్‌స్టాలో విజయ్‌తో కలిసి త్వరలో విడుదల కానున్న 'జుగ్ జుగ్ జుగ్ జియో' సినిమాలోని ఓ పాటకు స్టెప్పులేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఆ చిత్రానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ డ్యాన్స్ వీడియో కాఫీ విత్ కరణ్ షోలోనిది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఆ షోకు గెస్ట్‌గా విజయ్-అనన్య.. డ్యాన్స్ వీడియో వైరల్! - లైగర్ రిలీజ్ డేట్
Vijay devarkonda Ananya pandey dance video: ఓ షోలో విజయ్ దేవరకొండ-అనన్య పాండే సందడి చేయబోతున్నారని తెలిసింది. తాజాగా అనన్య విజయ్‌తో కలిసి డ్యాన్స్ వేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Vijay devarkonda ananya pandey coffee with karan
కాగా, కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'లైగర్' చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. విజయ్-అనన్య జంటగా నటించిన ఈసినిమాలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలు పోషించారు. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆగస్టు నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: 'ఆర్‌ఆర్‌ఆర్' బ్రిడ్జ్ సీక్వెన్స్.. ఇలా తెరకెక్కించారు!