తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విజయ్, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారా? వచ్చే నెలలోనే ఎంగేజ్‌మెంటా? - టీమ్ క్లారిటీ - Vijay rashmika news

Vijay Devarakonda Rashmika Engagement : టాలీవుడ్​ రూమర్​డ్​ కపుల్​ రష్మిక మందన్న, విజయ్​ దేవరకొండ త్వరలో పెళ్లితో ఒక్కటవనున్నారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

Vijay Devarakonda Rashmika Engagement
Vijay Devarakonda Rashmika Engagement

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 12:58 PM IST

Updated : Jan 8, 2024, 4:45 PM IST

Vijay Devarakonda Rashmika Engagement :గత కొంత కాలంగా టాలీవుడ్​తో పాటు సోషల్ మీడియాలో విజయ్​ దేవరకొండ, రష్మిక మందన్న గురించి తెగ చర్చలు జరగుతున్నాయి. ఈ ఇద్దరూ అప్పుడప్పుడు కలియతిరగడం చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పలు రూమర్స్​ కూడా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఇద్దరూ తమ ఫ్యాన్స్​కు సడెన్​ సర్​ప్రైజ్​ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట. తమ పెళ్లి గురించి అనౌన్స్​ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఇందులో భాగంగా వచ్చే నెల మొదటి వారంలో ఈ ఇద్దరూ ఎంగేజ్​మెంట్​ చేసుకోను న్నట్లు ఇటీవలే తెగ వార్తలు నెట్టింట హల్​ చల్​ చేశాయి. అయితే వీటిపై విజయ్​ దేవరకొండ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇందులో వాస్తవాలు లేవంటూ కొట్టిపారేసింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఏమాత్రం నమ్మొద్దంటూ కోరింది.

'గీతా గోవిందం' సినిమాతో ఆన్​స్క్రీన్​పై మంచి జోడీ అనిపించుకున్నారు రష్మిక విజయ్​ జంట. ఈ మూవీలో వాళ్ల యాక్టింగ్​తో పాటు కెమిస్ట్రీ సూపర్​ అంటూ ఫ్యాన్స్ అప్పట్లో ఈ జోడీకి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి 'డియర్ కామ్రేడ్' సినిమాతో ప్రేక్షకులను మరోసారి పలకరించారు. ఇందులోనూ ఈ జంట యాక్టింగ్​కు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఫ్యాన్స్ ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ నెట్టింట వీరిని ట్రెండ్ చేయడం మొదలెట్టారు. అయితే వీరిద్దరి మధ్య లవ్​ ఉన్నట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనని తాము మంచి స్నేహితులం అంటూ గతంలో వీరిద్దరూ సమాధానమిచ్చారు. పలు ఇంటర్వ్యూల్లోనూ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ వీరిద్దరూ అప్పుడప్పుడు బయట కలిసి కనిపించిన సందర్భాలున్నాయి. దీంతో ఆ రూమర్స్​ నిజమే అంటూ కొంత మంది నెటిజన్లు వీరి ఇన్​స్టా పోస్ట్​లను సోషల్​ మీడియాలో షేర్​ చేస్తూ కామెంట్లు పెడుతుంటారు. మరికొందరేమో ఆ ​పోస్ట్​లను నిశితంగా గమనిస్తుంటారు. అలా ఈ జంట పలు మార్లు ఒకే చోట ఉన్నట్లు కనిపించారు. కానీ ఇటువంటి విషయాలపై అటు విజయ్​ కానీ ఇటు రష్మిక కానీ స్పందించలేదు. అసలు క్లారిటీ కూడా ఇవ్వలేదు.

Last Updated : Jan 8, 2024, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details