తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Vijay Devarakonda Marriage News : 'అప్పుడే పెళ్లి చేసుకుంటా.. అనసూయతో నాకేం సంబంధం లేదు!' - ది టైటిల్ అందుకే అంటున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda Marriage News : రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ తన పెళ్లి గురించి మాట్లాడారు. అలాగే అనసూయతో సోషల్​మీడియాలో జరిగే వివాదం గురించి కూడా స్పందించారు. ఆ సంగతులు..

Vijay Devarakonda Marriage News
Vijay Devarakonda Marriage News : 'అప్పుడే పెళ్లి చేసుకుంటా.. అనసూయతో నాకేం సంబంధం లేదు!'

By

Published : Aug 9, 2023, 10:49 PM IST

Kushi Movie Trailer : రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ-స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​ మూవీ 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 1న థియేటరల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్​ను రిలీజ్​ చేసి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విజయ్‌ దేవరకొండ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

అందుకే ఖుషి చేశాను... 'ఖుషి' నాకు బాగా నచ్చిన కథ. లవ్‌ అనే ఎమోషన్‌. ప్రేమకథలపై ఒకానొక సమయంలో బాగా చిరాకు వచ్చి చేయకూడదనుకున్నాను. కానీ 'ఖుషి' కథ విన్నప్పుడు ప్రేమపై మరింత నమ్మకం వచ్చింది. నా గత చిత్రం ఫ్లాప్ అయింది. అందుకే ఈ లవ్​స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఇక వెబ్‌ సిరీస్‌ల విషయానికొస్తే.. చేయాలనుకోవడం లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు.

Vijay Devarakonda Marriage News : పెళ్లి అప్పుడే చేసుకుంటా..కొంతకాలంనుంచి భాగస్వామి కోసమే వెతుకుతున్నాను. కానీ ఇప్పుడు నేను పెళ్లికి సిద్ధంగా లేను. రెండు, మూడేళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటాను. నాకు ముందు కుటుంబమే ప్రాధాన్యం. ఆ తర్వాత ప్రేమ. అనంతరం పెళ్లి. రానున్న మూడేళ్లలో తప్పకుండా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాను.

'లైగర్‌' ఫ్లాప్​పై రియాక్షన్​..ఏదైనా సినిమా చేసినప్పుడు అది అనుకున్న విధంగా ఆడకపోతే బాధ పడతాము. 'లైగర్‌' కన్నా ముందు నేను ఎన్నో ఫ్లాప్స్‌, హిట్స్‌ చూశాను. గొప్ప కథలను చెప్పాలని భావిస్తాం. రిజల్ట్​ కొన్నిసార్లు బాధ పెట్టినప్పటికీ నా జర్నీని ఆపలేవు. కిందపడిపోతాననే భయం అస్సలు లేదు. పడితే బాధపడతాను. కానీ మళ్లీ నిలబడి మళ్లీ పరిగెడతాను.

Vijay devarakonda Anasuya Bharadwaj : పేరుకు ముందు 'ది' అందుకే..లైగర్‌ సమయంలో పూరీ జగన్నాథ్​ నాకు రెండు మూడు టైటిల్స్‌ చెప్పారు. ఆ టైటిల్స్‌తో నాకు అవసరం లేదని చెప్పాను. నా పేరు నాకు సరిపోతుందని చెప్పాను. కావాలంటే 'ది విజయ్‌ దేవరకొండ' వాడుకోవమని సలహా ఇచ్చాను. ఇకపోతే సోషల్‌మీడియలో అనసూయతో గొడవలు ఏం జరుగుతున్నాయో నాకైతే తెలీదు. గొడవపడే వాళ్లనే అడగండి అని విజయ్ అన్నారు.

Kushi Movie Trailer : భర్త అంటే ఎలా ఉండాలో చూపిస్తానంటున్న విజయ్​.. లవ్ అండ్ ఎమోషనల్​గా 'ఖుషి' ట్రైలర్​

బ్రేక్ తర్వాత సమంత చేయబోయే మొదటి పని ఇదేనటా... ఆబ్బో ప్లానింగ్ బాగానే ఉందిగా!

సమంత మళ్లీ 'ఖుషి' ఖుషీ.. గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పిన విజయ్ దేవరకొండ!

ABOUT THE AUTHOR

...view details