తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

''జనగణమన' గురించి మర్చిపోండి'.. విజయ్ దేవరకొండ​ ఆసక్తికర కామెంట్స్​! - విజయ్‌ దేవరకొండ పూరీ న్యూ ప్రాజెక్ట్​

ఆగస్టు 25న విడుదలైన 'లైగర్' బాక్సాఫీస్‌ వద్ద నిరాశను మిగిల్చింది. ఈ సినిమా విడుదలకు ముందే విజయ్‌ దేవరకొండతో తన కలల ప్రాజెక్టు 'జనగణమన' ప్రారంభిస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ప్రకటించారు. ఇప్పుడు 'లైగర్'​ ఎఫెక్ట్​తో 'జనగణమన' ప్రేక్షకుల ముందు రానున్నదా లేదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు పూరీ బృందం. తాజాగా విజయ్ దీనిపై స్పందించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Sep 13, 2022, 7:30 AM IST

Vijay devarakonda about janaganamana : టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ బ్యూటీ అనన్యపాండే జంటగా నటించిన లైగర్, ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశను మిగిల్చింది. లైగర్‌ సినిమా విడుదలకు ముందే విజయ్‌ దేవరకొండతో తన కలల ప్రాజెక్టు 'జనగణమన' ప్రారంభిస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ప్రకటించారు. చిన్న షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ లైగర్‌ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో దర్శక, నిర్మాతలు జనగణమన పై ఎటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు. ఈ ప్రాజెక్టుకి నిర్మాతలుగా వ్యవహరించిన పూరీ జగన్నాథ్‌, ఛార్మీలు(పూరి కనెక్ట్స్‌ యజమానులు) సైతం జనగణమన పై ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కనీసం జనగణమన ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలనూ ఖండించట్లేదు.

ఇటువంటి సమయంలో నటుడు విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా సైమా వేడుకకు హాజరైన ఇతడిని అక్కడి మీడియా జనగణమన గురించి ప్రశ్నించగా... 'ఇక్కడికి ప్రతీ ఒక్కరు వేడుకను ఎంజాయ్‌ చేయడానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ దాని గురించి మర్చిపోండి.. సైమాను ఎంజాయ్‌ చేయండి' అంటూ సమాధానమిచ్చాడు. విజయ్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు విజయ్‌ దేవరకొండ ఎప్పటిలా సైమా వేడుకల్లో సందడి చేయడాన్ని హర్షిస్తుంటే, మరికొందరు ఇక జనగణమన ఆగిపోయినట్లేనా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. దాదాపు ఆరేళ్ల క్రితమే పూరీ జగన్నాథ్‌ ఈ క్రేజీ ప్రాజెక్టు పేరు తెరపైకి తీసుకొచ్చి సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును సంప్రదించాడు. అయితే పలుకారణాలతో మహేశ్‌బాబు తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. తదనంతరం ఈ ఏడాది మార్చిలో విజయ్‌ దేవరకొండ, పూజా హెగ్దే జంటగా ఈ సినిమా షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇంతలోనే లైగర్‌ అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో జనగణమన ప్రాజెక్టుపై ప్రతిష్టంభన నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details