తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'న్యూడ్‌ ఫొటోషూట్‌'కు నేనూ రెడీ: విజయ్‌ దేవరకొండ - న్యూడ్​ ఫోటో షూట్​ విజయ్​ దేవరకొండ

'రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌'.. గత కొద్దిరోజులుగా బాలీవుడ్‌తో పాటు దేశంలోనే హట్​టాపిక్​గా మారింది. అయితే ఇప్పుడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కూడా ఇలాంటి ఫొటోషూట్‌కు సై అంటున్నారు.

vijay devarakonda comments on nude photoshoot
vijay devarakonda comments on nude photoshoot

By

Published : Jul 29, 2022, 5:07 PM IST

Vijay Deverakonda on Nude Photoshoot: : బోల్డ్​ లుక్​.. ఒకప్పుడు హీరోయిన్లు మాత్రమే పోజులు ఇచ్చేవారు. కానీ రణ్​వీర్​ అంతకంటే మరీ నూలు పోగు లేకుండా కనిపించి సోషల్​ మీడియాను షేక్ చేశాడు. మొత్తం సినిమా ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేశాడు. ఓ మ్యాగ్జైన్​ కోసం ఇచ్చిన ఫొటోషూట్​లో పూర్తిగా నగ్నంగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఇప్పుడు ఈ న్యూడ్​ ఫోటో షూట్​పై హీరో విజయ్​ దేవరకొండ స్పందించాడు.

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన 'లైగర్‌' కోసం మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న.. విజయ్ దేవరకొండ, అనన్య పాండే 'కాఫీ విత్‌ కరణ్‌ షో' ఏడో సీజన్‌ నాలుగో ఎపిసోడ్​లో పాల్గొన్నారు. ఈ షోలో విజయ్​కు కరణ్‌ బోల్డ్‌ ప్రశ్నలు అడిగారు. అటు విజయ్ కూడా ఏమాత్రం తడబడకుండా అంతే బోల్డ్‌గా సమాధానాలు ఇచ్చారు.

విజయ్​ దేవరకొండ, అనన్య పాండే

ఇలా ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో విజయ్‌ని కరణ్‌ అడుగుతూ.. 'ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్‌కు న్యూడ్‌గా పోజ్‌ ఇస్తావా?' అని అన్నారు. వెంటనే విజయ్‌.. 'బాగా తీస్తే న్యూడ్‌గా పోజులివ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు' అని చెప్పారు. ఇక 'ఇండియాలో మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్​ ఎవరు అనుకుంటున్నావ్‌?' అని అడిగితే.. మరో ఆలోచన లేకుండా సమంత పేరు చెప్పారు విజయ్‌. ఇక రష్మికతో రిలేషన్‌షిప్‌ గురించి అడిగితే.. 'ఆమె స్పెషల్‌' అని అన్నారు.

విజయ్​ దేవరకొండ, సమంత

అటు అనన్యను కూడా ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో కరణ్‌ ఇలాంటి ప్రశ్నలే వేశారు. 'విజయ్‌ను న్యూడ్‌గా చూడాలని అనుకుంటున్నావా?' అని కరణ్‌ అడిగితే.. 'లైగర్‌లోనే చాలా వరకు చూశాను. అయినా ఎవరు మాత్రం అలా చూడాలనుకోరు?' అని అనన్య అన్నారు. ఇక 'ఇండియాలో మోస్ట్‌ డిజైరబుల్‌ మ్యాన్‌ ఎవరు?' అని అడిగితే విజయ్ దేవరకొండ అని ఆమె చెప్పారు.

విజయ్ దేవరకొండ పోస్టర్​

కొద్దిరోజులు క్రితం 'లైగర్'​ మూవీ టీమ్..​ హీరో విజయ దేవరకొండకు సంబంధించిన షాకింగ్​ పోస్టర్​ను విడుదల చేసింది. ఇందులో విజయ్​.. కండలు తిరిగిన దేహంతో బోల్డ్​ లుక్​లో రోజాపూలు పట్టుకుని నిలబడి ఉన్నారు. ఈ పోస్టర్​.. విజయ్​ ఫ్యాన్స్​ను ఆకట్టుకోగా మిగతావారు మాత్రం భిన్నంగా స్పందించారు. మరో ఇప్పుడు న్యూడ్​ ఫోటోషూట్​పై విజయ్​ అభిప్రాయాన్ని ఫ్యాన్స్​ ఎలా తీసుకుంటారో చూడాలి.

ఇవీ చదవండి:చిరుతో సల్మాన్​ స్టెప్పులు.. బాక్సాఫీస్​ షేక్​!

Ramarao on Duty Heroine: దివ్యాంన్ష కౌశిక్‌ డ్రెస్సింగ్​ స్టైల్​ సూపర్​.. ఓ లుక్కేయండిలా.. ​

ABOUT THE AUTHOR

...view details