Vijay Parasuram Film : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. 'లైగర్' పరాజయం తర్వాత ఆయన ఎటువంటి సినిమాల్లో నటించనున్నారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తరుణంలో 'ఖుషి' సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో సమంత సరసన విజయ్ నటిస్తున్నారు. 'ఖుషి' కాకుండా మరో రెండు సినిమాలకు సైన్ చేశారు విజయ్. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమాతో పాటు పరశురామ్‌తోనూ కలిసి పనిచేయనున్నారు. ఈ క్రమంలో ఓ వైపు 'ఖుషి' సినిమా షూటింగ్ బిజీలో ఉన్న ఆయన ఈ రెండు చిత్రాల కోసం రంగంలోకి దిగారు.
ఇక ఈ రెండు ప్రాజెక్ట్‌లు అనౌన్స్ అయిన తర్వాత అభిమానుల్లో విజయ్ లైనప్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా పరశురామ్ సినిమాపై ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషనన్స్ పెంచుకుంటున్నారు. వీరిద్దరి కాంబోలో ఉన్న 'గీతా గోవిందం' సినిమా ఇందుకు కారణం. 2018లో వచ్చిన ఈ సినిమా అటు యూత్‌తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. అంతే కాకుండా విజయ్ కెరీర్‌ను ఓ మలుపు తిప్పిన సినిమాల్లో 'గీత గోవిందం' కూడా ఒక్కటి. ఆ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరూ తాజాగా కలిశారు. 'VD 13'గా తెరకెక్కుతున్న సినిమా కోసం పని చేసేందుకు రెడీగా ఉన్నారు.