Vijay Antony Daugther Suicide : కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఆత్మహత్య యావత్ సినీ ప్రపంచాన్ని కలిచివేసింది. 16 ఏళ్ల వయసులో ఆ యువతి కన్నుమూయడం దిగ్భ్రాంతికర విషయం అని సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. చదువు ఒత్తిడి వల్లేనని బయట కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంతో గతంలో విజయ్ ఆంటోనీ సూసైడ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అప్పుడు తండ్రి ఇప్పుడు కూతురు..
Vijay Antony Father :గతంలో విజయ్ ఓ ఈవెంట్లో తన గతం గురించి చెప్పుకొచ్చారు. తనకు ఏడేళ్ల వయసున్నప్పుడే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని.. అప్పుడు తన అమ్మ కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేశారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా.. సూసైడ్ మాత్రం చేసుకోవద్దంటూ చెప్పుకొచ్చారు. "నాకు 7 ఏళ్ల వయసునప్పుడు నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత మా అమ్మ.. నన్ను నా చెల్లిని ఎంతో కష్టపడి పెంచారు. ఆ బాధ నాకు తెలుసు. నేను లైఫ్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను" అని విజయ్ అన్నారు.