Bichagadu 2 Collections : తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన 'బిచ్చగాడు 2'కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విజయ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఫస్ట్ షో రివ్యూలకు భిన్నంగా మౌత్‌టాక్‌తో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అలా మే 19న విడుదలై తొలి రోజు నుంచి హిట్ టాక్ తెచుకున్న ఈ మూవీకి బాక్సాఫీస్ ముందు కలెక్షన్లు మంచిగా వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. అయితే ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్లో బాగా వసూలు చేసింది.
ఈ చిత్రానికి తెలుగులో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. థియేట్రికల్ రైట్స్ కోసం గట్టి పోటీనే ఏర్పడగా.. డిమాండ్‌కు తగ్గట్టే రూ. 6కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 15 కోట్ల జరిగిందని సమాచారం. అయితే ఈ సినిమా తెలుగులో ఫస్ట్ వీకెండ్లో రూ.9.5కోట్ల వరకు కలెక్షన్లను అందుకుందని సమాచారం అందింది. ఓ చిన్న తమిళ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడం మంచి విషయం. దీంతో ఈ వీకెండ్ కూడా వసూళ్లు ఇంకా పెరుగుతూనే ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.21.25 కోట్ల గ్రాస్ వసూలు చేసిందట.
బిచ్చగాడు 3పై విజయ్ ఆంటోని.. బిచ్చగాడు 2కు వస్తున్న రెస్పాన్స్‌పై హర్షం వ్యక్తం చేసిన విజయ్ ఆంటోని.. 'బిచ్చగాడు 3'పై మాట్లాడారు. "బిచ్చగాడు2 కు కొనసాగింపుగా మూడో భాగం కూడా తెరకెక్కుతుంది. అది పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్ కథతో తెరకెక్కుతుంది. స్క్రిప్ట్‌ను రెడీ చేయడానికి ఏడాదికి పైనే సమయం పడుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025లో సినిమాను ప్రారంభిస్తా. దానికి కూడా నేనే డైరెక్ట్ చేస్తా అని విజయ్ అన్నారు.
ఇక సినిమా విషయానికొస్తే..2016లో వచ్చిన'బిచ్చగాడు' సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఏ అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను అందుకుంది. మధర్ సెంటిమెంట్ బాగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా 'బిచ్చగాడు 2'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఈ సినిమా కోసం సినీ ప్రియులు థియేటర్‌కు వెళ్లగా.. సినిమా కూడా అంచనాలను అందుకుంది. ఈ సీక్వెల్ విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయనే. ఆయన భార్యనే సినిమా నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. రాధారవి, వైజీ మహేంద్రన్, మన్సూర్ అలీఖాన్, హరీశ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
ఇదీ చూడండి: స్టేజ్‌పై నరేశ్-పవిత్ర రొమాంటిక్ డ్యాన్స్.. చూశారా?