Bichagadu 2 Review : విజయ్ అంటోనీ హీరోగా 2016లో వచ్చిన 'బిచ్చగాడు' ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా తమిళంలో కన్నా తెలుగులోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను అందుకుంది. విజయ్ అంటోనీ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లను సాధించిందీ సినిమా. అయితే ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన 'బిచ్చగాడు 2' సినిమా భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీయే దర్శకత్వం వహించారు. ఆయన భార్య ఫాతిమా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. విజయ్‌కు జోడీగా కావ్య థాపర్ నటించారు. 'బిచ్చగాడు 2'ను థియేటర్లతో చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారంటే?
'బిచ్చగాడు 2' సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. 'బిచ్చగాడు 2' సినిమా 'బిచ్చగాడు'కు సీక్వెల్ కాదని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ప్రేక్షకులను కట్టిపడేసేశాయట. థ్రిల్లింగ్‌కు గురిచేసే అంశాలు ఉన్నాయని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇంటర్వెల్ సీన్ మంచి ట్విస్ట్‌తో ముగుస్తుందని చెబుతున్నారు. అయితే వీఎఫ్ఎక్స్ పేలవంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదని.. స్క్రీన్‌ప్లే పేలవంగా ఉందని అంటున్నారు.