తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Bichagadu 2 collection : 'బిచ్చగాడు 2'కు మొదటి రోజు ఊహించని కలెక్షన్స్​.. కోట్లలో! - బిచ్చగాడు 2 ఫస్ట్ డే కలెక్షన్స్​

పాజిటివ్​ టాక్​ తెచ్చుకున్న 'బిచ్చగాడు 2' సినిమా మొదటి రోజు మంచి వసూళ్లను అందుకుంది. ఎంత సాధించిందంటే?

bichagadu 2
బిచ్చగాడు 2

By

Published : May 20, 2023, 3:11 PM IST

Updated : May 20, 2023, 4:29 PM IST

కోలీవుడ్​ స్టార్​ యాక్టర్​ విజయ్​ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'బిచ్చగాడు 2'. 2016లో విడుదలైన సూపర్​ హిట్​ సినిమా 'బిచ్చగాడు'కు సీక్వెల్​గా ఈ సినిమా తెరకెక్కింది. మధర్​ సెంటిమెంట్​తో రూపొందిన ఈ సినిమాకు అప్పట్లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్​ వచ్చింది. వెంకటేశ్​తో 'శీను' అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శశి ఈ సినిమా మొదటి భాగాన్ని తెరకెక్కించారు. అప్పటి వరకు మ్యూజిక్​ డైరెక్టర్​గా మంచి క్రేజ్​ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ ఈ చిత్రంలో నటించడమే కాకుండా.. ఈ చిత్రాన్ని నిర్మాణ పనుల్లో కూడా భాగస్వామ్యమయ్యారు. అయితే మొదట ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ రెండో వారం నుంచీ ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించి 100 రోజులు ఆడింది. తెలుగులో చాలా కాలం తరువాత 100 రోజులు ఆడిన తమిళ సినిమాగా రికార్డులు సృష్టించింది. ఏకంగా 15 కోట్ల కలెక్షన్స్ అందుకుని రికార్డుకెక్కింది.

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్​గా వచ్చిన 'బిచ్చగాడు 2' మే 19న గ్రాండ్​గా రిలీజై ఇదే రేంజ్​లో పాజిటివ్​ టాక్​ను తెచ్చుకుంది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. పలు వెబ్​సైట్లు రాసిన కథనాలు ప్రకారం ఈ చిత్రం దాదాపు రూ.2.23కోట్లు షేర్​ను అందుకున్నట్లు తెలిసింది. రూ.4కోట్ల గ్రాస్​ను కూడా అందుకుందట. ఇందులో విజయ్​ ఆంటోనీ సరసన కావ్యా థాపర్ హీరోయిన్​గా నటించారు. తెలుగులో ఈ సినిమాను ఉషా పిక్చర్స్ బ్యానర్ మీద విజయ్ కుమార్, వీరనాయుడు సంయుక్తంగా తెరకెక్కించారు. రాధా రవి, వై.జి. మహేంద్రన్, యోగి బాబు లాంటి స్టార్స్​ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజైంది.

ఆ రెండింటికీ లింకేంటంటే?
తాజాగా ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్ న్యూస్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా విడుదలైన కొన్ని గంటలకే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోటును వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. గతంలో ఈ సినిమా తొలి పార్ట్​ విడుదలైన సంవత్సరంలోనే రూ. 500, రూ. 1000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇప్పుడు 'బిచ్చగాడు 2' సినిమా విడుదలైన సంవత్సరంలోనే రూ. 2000 నోట్లను ఉపసంహరణ చేస్తున్నట్లుగా తెలిపింది. దీంతో ఈ రెండింటిని కలిసి సామాజిక మాధ్యమాల్లో సరదా మీమ్స్ వస్తున్నాయి.నోట్ల రద్దుపై 'బిచ్చగాడు' ప్రభావం చాలా ఉందంటూ అభిమానులు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Last Updated : May 20, 2023, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details