Vijay Antony Accident :బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ మరోసారి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. 'బిచ్చగాడు 2' సీక్వెల్‌తో ఈ నెల 12న ఆడియన్స్ ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ కావ్య థాపర్‌తో కలిసి ఓ చిట్‌చాట్ షోలో పాల్గొన్నారు విజయ్ ఆంటోనీ. 'బిచ్చగాడు-2' సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు జరిగిన ఓ బోటు ప్రమాదానికి సంబంధించి మొదటిసారి ఈ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆ ప్రమాదం ఎలా జరిగింది? అందుకు తనకు జరిగిన సర్జరీ ఏంటి అనే ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
విజయ్ ఆంటొనీ ముఖం మొత్తం గాయాలు, రక్తం.. కిందకు జారిన దవడ భాగం.. ఏం జరిగిందంటే? - Jet Ski location
Vijay Antony Accident : తమిళ హిరో విజయ్ ఆంటోనీ తనకు జరిగిన ఓ ఘోరమైన ప్రమాదం గురించి చెప్పారు. 'బిచ్చగాడు 2' సినిమా షూటింగ్ సమయంలో తాను తీవ్రంగా గాయపడినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే?..
Vijay Antony Accident : " 'బిచ్చగాడు 2'లో కొన్ని సీన్స్‌ను షూట్ చేసేందుకు మేమంతా మలేసియాలోని లంకావి ప్రాంతానికి వెళ్లాం. లవ్ సాంగ్ షూట్‌లో భాగంగా నేనూ కావ్య ఓ జెట్ స్కిపై ఉన్నాం. మిగిలిన చిత్రబృందం మరో బోట్‌పై ఉండి పాటను చిత్రీకరిస్తున్నారు. విజువల్స్ చక్కగా రావాలనే ఉద్దేశంతో నేను ఫుల్ స్పీడ్‌లో జెట్ స్కిని డ్రైవ్ చేస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. నా ముఖానికి బోటు గట్టిగా తగిలింది. ముఖం మొత్తం గాయాలు, రక్తం, దవడ భాగం కిందకు జారింది. గాయాలతో బోటు ఉన్న నీటిలోనే పడిపోయాను. మా టీమ్ అప్రమత్తమై నన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించింది. ఆ తర్వాతి రోజు నేను స్పృహలోకి వచ్చాను. నన్ను చూసి అందరూ కంగారుపడ్డారు. నా ముఖానికి తగిలిన గాయాలు కనిపించకుండా, దవడను సరిచేయడానికి సుమారు 9 ప్లేట్లు వేశారు. నెలన్నరపాటు లిక్విడ్ డైట్‌లోనే ఉన్నా. అందుకే ఫిజికల్‌గానూ సన్నబడ్డాను. ఈ ప్రమాదం వల్ల మాట్లాడేటప్పుడు కాస్త ఇబ్బందిపడ్డాను. ఇప్పటికీ కొన్ని పదాలను స్పష్టంగా పలకలేకపోతున్న. దవడ భాగంలో ప్లేట్లు వేయడం వల్ల నా లుక్ కూడా చాలా మారింది. 'బిచ్చగాడు-2' సినిమా సోదరి సెంటిమెంట్‌తో తెరకెక్కింది. తప్పకుండా ఇది సూపర్‌హిట్ విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం నాకుంది."- విజయ్ ఆంటోనీ
"విజయ్ ఆంటోనీ గొప్ప నటుడు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకెంతో ఆనందంగా అనిపించింది. బోటు ప్రమాదం జరిగినప్పుడు ఆయన్ని చూసి నేను చాలా కంగారుపడ్డాను. ఆయన ఎలా కోలుకోగలడు అని అనుకున్నాను. మూడు నెలల తర్వాత మొదటిసారి ఆయన్ను కలిసినప్పుడు షాక్‌కు గురయ్యాను. ఆయన ముఖంపై ఒక్క గాయం కూడా కనిపించలేదు. ఆయన పూర్తిగా మారిపోయారు" అని హీరోయిన్ కావ్య థాపర్ ఇంటర్వ్యూలో అన్నారు.