Daljeet Kaur Passes Away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పంజాబీ నటి దల్జీత్ కౌర్(69)కన్నుమూశారు. గత మూడేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమె గతేడాదిగా కోమాలో ఉన్నారు. ఈ క్రమంలో పంజాబీలోని లూథియానాలో రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు.
సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత - దల్జీత్ కౌర్ సినిమాలు
ప్రముఖ పంజాబీ నటి దల్జీత్ కౌర్ కన్నుమూశారు. గత మూడేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమె గతేడాదిగా కోమాలో ఉన్నారు. ఆమె మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
veteran punjabi actor daljeet kaur khangura passes away
1976లో వెండితెరకు పరిచయమైన ఆమె 'పుట్ జట్టన్ దే', 'కీ బాను దునియా దా', 'సర్పంచ్' తదితర సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పంజాబ్‌లో టాప్ నటిగా పేరొందిన దల్జీత్ 70 పంజాబీ సినిమాల్లో 10కి పైగా హిందీ చిత్రాల్లో నటించారు. దల్జీత్ కౌర్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.