బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే(77) కన్నుమూశారు. గత కాంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణెలోని దీననాథ్ మంగేష్కర్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. గోఖలే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, విక్రమ్ గోఖలే మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన స్టార్ హీరో అజయ్ దేవగన్.. గోఖలే ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు వన్నె తెచ్చారని కొనియాడారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. విక్రమ్ గోఖలే మృతి బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి - Vikram Gokhale health condition
బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే(77) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
బాలీవుడ్ సినీ పరిశ్రమతో పాటు మరాఠి చిత్ర సీమలోనూ విక్రమ్ గోఖలే గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అలానే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. మరాఠిలో ఆఘాత్ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసి తొలిసారిగా దర్శకుడిగానూ పరిచయం అయ్యారు. 1990లలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన అగ్నీపథ్, 1999లో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ జంటగా నటించిన హమ్ దిల్ దే చుకే సనం వంటి చిత్రాలు విక్రమ్ గోఖలేకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. హిందీ సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లోనూ విక్రమ్ గోఖలే తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. రంగస్థలంపైనా విక్రమ్ గోఖలే తనదైన ముద్ర వేసుకున్నారు.
ఇదీ చూడండి:అవతార్ మేనియా 3 రోజుల్లో 15 వేలు