తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అందుకే 9 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా: నటుడు వేణు - venu thottempudi

Venu Thottempudi About Reentry: 'హనుమాన్​ జంక్షన్​', 'పెళ్లాం ఊరిళితే', 'గోపి..గోపిక.. గోదావరి' వంటి పలు చిత్రాలతో తెలుగు సినీ ప్రియుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడు వేణు తొట్టెంపూడి. తాజాగా ఆయన నటించిన చిత్రం 'రామారావు ఆన్​ డ్యూటీ'. ఈ నేపథ్యంలో ఎందుకు 9 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారో వేణు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

Venu Thottempudi About Reentry:
Venu Thottempudi About Reentry:

By

Published : Jul 7, 2022, 8:46 AM IST

Venu Thottempudi About Reentry: 'స్వయంవరం', 'చిరునవ్వుతో', 'హనుమాన్‌ జంక్షన్‌', 'కల్యాణ రాముడు', 'పెళ్లాం ఊరిళితే', 'ఖుషి ఖుషీగా', 'చెప్పవే చిరుగాలి', 'గోపి.. గోపిక.. గోదావరి' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు వేణు తొట్టెంపూడి. తనదైన హాస్యంతో గిలిగింతలు పెట్టే ఆయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. సుమారు 9 ఏళ్లకు 'రామారావు ఆన్‌ డ్యూటీ' అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ హీరోగా శరత్‌ మండవ తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా వేణు సోషల్‌ మీడియా వేదికగా సినిమా సంగతులు పంచుకున్నారు.

చాలాకాలం తర్వాత నటించడం ఎలా అనిపించింది?
వేణు: సినిమాలకే నేను తొలి ప్రాధాన్యమిస్తా. కానీ, అనివార్య కారణాల వల్ల కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్నా. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత నటించడం చాలా సంతోషంగా ఉంది. 'రామారావు ఆన్‌ డ్యూటీ'తోపాటు 'పారా హుషార్‌' అనే సినిమాలోనూ కీలక పాత్ర పోషించా.

'రామారావు ఆన్​ డ్యూటీ'లో నటుడు వేణు లుక్​

'రామారావు'తోనే కమ్‌బ్యాక్‌ ఇవ్వడానికి కారణం?
వేణు: ఈ సినిమా దర్శక, నిర్మాతలు నాకు చాలా సార్లు ఫోన్‌ చేసి నటించమని అడిగినా ముందు నేను ఒప్పుకోలేదు. ‘మీరు ఈ చిత్రంలో నటించకపోయినా ఫర్వాలేదు. ఓసారి కలుద్దాం’ అని దర్శకుడు శరత్‌ మండవ మెసేజ్‌ చేశారు. ఓ సారి మీట్‌ అయ్యాం. ఆ ముచ్చట్లలో భాగంగా ‘మీ పాత్రను ఇలా అనుకుంటున్నా. మీకు నమ్మకం ఉంటే చేయండి’ అని ఆయన అన్నారు. నాకూ ఆ క్యారెక్టర్‌ బాగా నచ్చడంతో రెండుమూడు సార్లు శరత్‌తో చర్చించి, నటించేందుకు ఓకే చెప్పా. అంతకుముందు వేరే కథలూ విన్నా. అనుకోకుండా ఇది పట్టాలెక్కింది.

ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
వేణు: ఇంతకుముందు నేను పోషించినవన్నీ చాలా సరదా పాత్రలు. ఈ చిత్రంలో సీఐ మురళీగా పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తా. ఇందులో నేను ఎలా నటించానో ప్రేక్షకులే చెప్పాలి.

రవితేజతో నటించడం గురించి చెప్తారా?
వేణు: ఆయన ఓ పవర్‌ హౌజ్‌. ఎంతో సరదాగా ఉంటాడు. నటనకు సంబంధించి ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేస్తాడు. ఎంతో హోమ్‌ వర్క్‌ చేస్తాడు. పనిపై స్పష్టత ఉన్న వ్యక్తి. ఆయనతో నేను కలిసి నటించిన సన్నివేశాలన్నీ మీ అందరినీ మెప్పిస్తాయి.

ఇవీ చదవండి:సమంత 'పెట్‌'తో నాగ చైతన్య.. 'ప్రేమ' గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్!

'రామారావు ఆన్ డ్యూటీ'లో వేణు.. పవర్​ఫుల్​ పోలీస్​ ఆఫీసర్​గా..

ABOUT THE AUTHOR

...view details