Venky Movie Re Release :మాస్ మహారాజ రవితేజ మూవీస్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన మూవీస్‌లో సెంటిమెంట్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. అందుకే మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈయన సినిమాలకు బాగా కనెక్ట్ అవుతుంటారు.
ఇక ఆయన మూవీస్‌లో 'వెంకీ'కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇందులోని కామెడీ సీన్స్‌కు ఇప్పటికీ ఫ్యాన్స్ కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈ సినిమాలోని డైలాగులు, పాటలు సోషల్ మీడియాలో ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం కానుంది. డిసెంబర్ 30న థియేటర్లలో ఈ చిత్రం రీ రిలీజ్ కానుంది. ఇది విన్న ఆడియెన్స్ ఈ సినిమాకు ఓ రేంజ్లో టికెట్స్ కొనుక్కుని రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా 'వెంకీ' మూవీ డైరెక్టర్ శ్రీను వైట్ల సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు. అందులో ఈ సినిమా గురించి ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్నఅభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.
"నాకెంతో ఇష్టమైన 'వెంకీ' సినిమా రీ రిలీజ్ కావడం నాకు సంతోషంగా ఉంది. ఆ సినిమా ఎప్పుడు గుర్తొచ్చినా నాకు నవ్వొస్తుంటుంది. దాని షూటింగ్ మొత్తం కూడా మేము సరదాగానే చేశాం. ఆ సినిమా అంత బాగా రావడానికి మెయిన్ రీజన్ రవితేజ. ఆయన నాపై నమ్మకంతో ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పారు. యువత ఎదుర్కొనే సవాళ్లు వారి ఎమోషన్స్‌తో రూపొందిన 'వెంకీ' ఓ ఎవర్‌గ్రీన్. అందులో బ్రహ్మానందం పోషించిన పాత్రకు ఆడియెన్స్‌లో ఎంతో ఆదరణ లభించింది. 2004లో వచ్చిన ఈ సినిమా రీ రిలీజ్ టికెట్స్ బుకింగ్స్ చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది" అంటూ ప్రేక్షకులందరికీ శ్రీను కృతజ్ఞతలు చెప్పారు.