సినీ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు.. తమ తర్వాతి చిత్రాలను కూడా వరుసగా అదే హీరోలతోనే తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు నిర్ధిష్ట కారణమైతే ఉండకపోవచ్చు కానీ.. కారణేమైనా ఈ కాంబో కొన్ని సార్లు బాక్సాఫీస్‌కు బ్లాక్‌బస్టర్ తెచ్చిపెడుతుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు వరుసగా పలువురు దర్శకులు తమ సినిమాల కోసం ఒకే హీరో మరో సినిమా ఫార్ములా వాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ వారెవరంటే..
srikanth odela new movie : 'దసరా' సినిమాతో తొలి ప్రయత్నంలోనే భారీ హిట్ అందుకున్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100కోట్ల వసూళ్లను అందుకుందీ చిత్రం. దీంతో శ్రీకాంత్.. తన తర్వాత చిత్రం ఎవరితో చేస్తారు? ఎలాంటి కథతో వస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడాయన మళ్లీ హీరో నానితోనే చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. దీనికి కూడా 'దసరా' నిర్మాతే నిర్మిస్తారని సమాచారం.
nani vivek athreya movie : 'మెంటల్ మదిలో' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే హిట్ అందుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ.. 'బ్రోచేవారెవరు రా' అనే తన రెండో చిత్రాన్ని హీరో శ్రీ విష్ణుతో చేసి మరోసారి హిట్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత నానితో హిలేరియస్ ఎమోషనల్ ఎంటర్టైనర్ 'అంటే.. సుందరానికీ!' చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు తన తర్వాతి చిత్రాన్ని నానితోనే చేయనున్నారట. నాని 31గా ఈ సినిమా తెరపైకి వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
hasith goli sree vishnu new movie : వివేక్ ఆత్రేయ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన హశిత్ గోలి.. 'రాజా రాజ చోరా' అనే చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను అందుకుంది. అయితే ఆ తర్వాత ఈయన ఇప్పుటివరకు ఏ చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు. అయితే ఇప్పుడు ఆయన తన తర్వాతి సినిమాను శ్రీవిష్ణుతో చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.