దాదాపు 19 ఏళ్ల క్రితం విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమాను విక్టరి వెంకటేశ్ హీరోగా పెట్టి తీయాలనుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ, పలు కారణాలతో ఆ సినిమాను చివరకు మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించారు మూవీ మేకర్స్. ఇంతకీ ఆ సినిమా ఏదంటే.. శంకర్‌దాదా ఎంబీబీఎస్. 2004 అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద మంచి విజయం సాధించింది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించిన హిందీ సినిమా మున్నా భాయ్ ఎంబీబీఎస్. ఈ సినిమా 2003లో రిలీజ్ అయి అక్కడ మంచి విజయం సాధించింది. దీనికి రీమేక్ గానే తెలుగులో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ను తెరకెక్కించారు.
వెంకటేష్ చేయాల్సిన సినిమాను చిరు చేశారట.. ఆ మూవీ ఏదో తెలుసా?
ఎప్పుడో 19 ఏళ్ల క్రితం విడుదలై విజయం సాధించిన ఓ సినిమాను హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి చేయాలనుకున్నారట మూవీ మేకర్స్. కానీ, కొన్ని కారణాలతో అంతా తారుమారై చివరికి మెగస్టార్ చిరంజీవిని హీరోగా పెట్టి తీశారు దర్శకనిర్మాతలు. ఇంతకీ ఆ సినిమా ఏదంటే..
అయితే ఈ సినిమా ముందు వెంకటేష్‌తో చేయాలనుకున్నారట. సంజయ్ దత్ నటించిన మున్నా భాయ్ సినిమాను ముందుగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఆల్ ఇండియన్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇంతలో ఏం జరిగిందో తెలీదు కానీ.. హీరో, నిర్మాత, డైరెక్టర్ అందరూ మారిపోయారు. అదే సినిమాను చిరంజీవితో రీమేక్ చేశారు.
రీమేక్ ఫార్ములా అప్పటి నుంచే..
ఓ ఇండస్ట్రీలో హిట్ సాధించిన సినిమాని మరో చిత్రపరిశ్రమలో రీమేక్ చేయడం అనేది 2000 మొదట్లో నుంచే ప్రారంభమైంది. అయితే ఈ రీమేక్ మూవీలను ఎంచుకునే విషయంలో మాత్రం హీరోలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూంటారు. ముఖ్యంగా రీమేక్ సినిమాలో తమ క్యారెక్టర్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా లేదా అన్న విషయాన్ని మాత్రం కచ్చితంగా బేరీజు వేసుకుంటారు నటులు. ఇలా ఎంచుకున్న సినిమాలు హిట్ అయినా.. నిరాశపరిచినా ప్రేక్షకులు మాత్రం వాటిని చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తన అభిమానుల కోసం ఎప్పుడూ కొత్తదనాన్ని ఎంచుకునే హీరో చిరంజీవి ఆయన కెరీర్లో దాదాపు 38కి పైగా రీమేక్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తన 155వ చిత్రం 'భోళా శంకర్' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇది కూడా తమిళ చిత్రం 'వేదాళం'కి రీమేక్. మరోవైపు హీరో విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం హిందీ చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇది 2014 తమిళ చిత్రం 'వీరమ్'కు రీమేక్ గా తెరకెక్కుతోంది. అంతే కాకుండా 'సైంధవ్' అనే మరో సినిమాలోనూ నటిస్తున్నారు విక్టరీ వెంకటేశ్. ఇక చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య.. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. దీంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారి చిరు. వెంకీ మామ కూడా రానా నాయుడు వెబ్ సిరీస్‌తో ఆడియన్స్‌ను ఖుషీ చేశారు.