తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సంక్రాంతి బరిలో వెంకీ మామ - ఇప్పటి వరకు ఎన్ని హిట్లు కొట్టారంటే?

Venkatesh Sankaranthi Movies : సంక్రాంతి అంటే సినిమా లవర్స్​కు పెద్ద పండుగ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు బడా నుంచి యంగ్ స్టార్స్ వరకు అందరూ తమ సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తుంటారు. అయితే విక్టరీ వెంకటేశ్​ కూడా తన మూవీస్​తో ఎన్నో సార్లు సంక్రాంతికి సందడి చేశారు. ఆ విశేషాలు.

Venkatesh Sankaranthi Movies
Venkatesh Sankaranthi Movies

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 10:30 AM IST

Updated : Jan 13, 2024, 12:53 PM IST

Venkatesh Sankaranthi Movies :టాలీవుడ్​లో ఫ్యామిలీ సినిమాలు అంటే మనకు గుర్తొచ్చే ఏకైక పేరు విక్టరీ వెంకటేశ్. తన నటనతో ఆయన ఎంతో మంది ఫ్యామిలీ ఆడియెన్స్​ను తనవైపుకు తిప్పుకున్నారు. అలా దాదాపు 74 సినిమాలను కంప్లీట్​ చేసుకున్న ఈ స్టార్ 'సైంధవ్‌' సినిమాతో తన కెరీర్​లో 75వ మైల్​స్టోన్​ను దాటారు. అయితే ఇప్పటి వరకు సాప్ట్​ క్యారెక్టర్లతో పాటు యాక్షన్ మూవీస్​ చేస్తూ అభిమానులను ఉర్రూతలూగించిన ఈ స్టార్ ఈ సినిమాతో మరింత యాక్షన్​తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ముందుకొచ్చారు. పాన్ ఇండియా లెవెల్​లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా నేడు ( జనవరి 12)న థియేటర్లలోకి వచ్చింది. అయితే వెంకీ మామ ఇప్పటి వరకు పలు మార్లు తన సినిమాలతో సంక్రాంతి బరిలో సందడి చేశారు. ఆ సినిమాలు ఏవంటే ?

  1. రక్త తిలకం (14 జనవరి 1988)
    'రక్త తిలకం' అనే మూవీతో వెంకీ మామ తొలి సారి సంక్రాంతి బరిలోకి వచ్చారు. యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్​బస్టర్ హిట్​గా నిలిచింది.
  2. ప్రేమ ( 12 జనవరి 1989 )
    1989లో విడుదలైన 'ప్రేమ' మూవీ ఎంతటి గ్రాండ్ సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్సకు మ్యూజిక్​ లవర్స్​లో ఎంతో క్రేజ్ ఉంది. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలో విడుదలైంది.
  3. చంటి (10 జనవరి 1992)
    వరుస హిట్లు అందుకుని దూసుకెళ్తున్న వెంకీ మామ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సంక్రాంతి బరిలోకి వచ్చారు. ఆయన నటించిన 'చంటి' సినిమా 1992 జనవరి 10న విడుదలైంది. ఈ సినిమా కూడా క్లాసిక్ హిట్​గా నిలిచి వెంకీ కెరీర్​కు టర్నింగ్ పాయింట్​గా నిలిచింది.
  4. పోకిరి రాజా ( 12 జనవరి 1995)
    1995 జనవరి 12న విడుదలైన 'పోకిరి రాజా' మాత్రం మిశ్రమ ఫలితంతో థియేటర్లలో నడిచింది.
  5. ధర్మ చక్రం ( 13 January 1996 )
    తండ్రీ కొడుకుల నేపథ్యంలో తెరకెక్కిన 'ధర్మ చక్రం' కూడా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది 1996 జనవరి 13న విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్​ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది.
  6. చిన్నబ్బాయి (10 January 1997)
    ఇక సంక్రాంతి పండుగ వెంకీకి బాగా కలిసొచ్చిన పండుగ అవ్వడం వల్ల ఆయన మరోసారి 1997లో 'చిన్నబ్బాయి' అనే సినిమాతో మళ్ళీ సంక్రాంతి వచ్చారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది.
  7. కలిసుందాం రా (14 January 2000)
    2000లో ఫ్యామిలీ అనుబంధాల బ్యాక్​డ్రాప్​తో సంక్రాంతికి వచ్చిన 'కలిసుందాం రా' మూవీ వెంకీ మామకు మంచి హిట్ అందించడమే కాకుండా ఈ సినిమా ఫీచర్​ ఫిల్మ్​ నేపథ్యంలో నేషనల్ అవార్డుని కూడా అందుకుంది.
  8. దేవి పుత్రుడు ( 14 January 2001)
    ఇక 2001లో విడుదలైన 'దేవి పుత్రుడు' భారీ విజువల్ ఎఫెక్ట్స్​ ఉన్న చిత్రంగా సంక్రాంతి బరిలోకి వచ్చింది. అయితే ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో టాక్ సాధించలేకపోయింది.
  9. లక్ష్మి (14 జనవరి 2006)
    2006లో వచ్చిన 'లక్ష్మి' సినిమాతో వెంకీ మరో సూపర్ హిట్​ను తన ఖాతాలో వేసుకున్నారు. యాక్షన్​, ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
  10. నమో వేంకటేశ (14 జనవరి 2010)
    2010 సంక్రాంతి బరిలోకి వచ్చిన 'నమో వేంకటేశ' మూవీ యావరేజ్ టాక్​తో సరిపెట్టుకుంది.
  11. బాడీగార్డ్ (9 జనవరి 2012 )
    2012లో విడుదలైన 'బాడీగార్డ్' కూడా మిశ్రమ ఫలితాన్ని అందుకుని థియేటర్లలో రన్ అయ్యింది.
  12. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (11 January 2013 )
    2013లో సంక్రాంతి బరిలోకి వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కూడా సూపర్ హిట్​ టాక్​ అందుకుంది.
  13. గోపాల గోపాల (10 January 2015 )
    2015లో విడుదలైన 'గోపాల గోపాల' సినిమా మరో సూపర్ హిట్​ రూపంలో వెంకీ ఖాతాలో పడింది.
  14. F2 ( 12 January 2019 )
    2019 సంక్రాంతి బరిలోకి 'F2' అనే ఫన్నీ ఎంటర్​టైనర్ వచ్చింది. ఇది కూడా ప్రేక్షకులను అలరించి వెంకీ మామకు మంచి హిట్ వెంకీ ఖాతాలో పడింది.

ఇలా వెంకీ మామ సంక్రాంతి బరిలోకి 15 సార్లు ఎంట్రీ ఇచ్చారు. రెండు సార్లు మాత్రమే మిశ్రమ ఫలితాన్ని అందుకున్నారు. మూడు సార్లు యావరేజ్ టాక్​ని అందుకున్నారు. 10 సినిమాలతో బ్లాక్​ బస్టర్స్​ను సొంతం చేసుకున్నారు. చూడాలి మరీ ఈ సైంధవ్​ ఆయనకు ఎటువంటి రిజల్ట్​ను తెచ్చిపెడుతుందో ?

Last Updated : Jan 13, 2024, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details