Venkatesh Daughter Engagement : టాలీవుడ్ ఫ్యామిలీ హీరో వెంకటేశ్ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పుడు ఆయన రెండో కుమార్తె హయవాహిని నిశ్చితార్థం బుధవారం సైలంట్‌గా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో వెంకటేశ్ స్వగృహంలోనే ఈ వేడుకను నిర్వహించారు. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి జరగనున్నట్లు సమాచారం.
Venkatesh Daughter Engagement : వెంకీ మామ రెండో కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన సినీ ప్రముఖులు - Venkatesh second Daughter Engagement
Venkatesh Daughter Engagement : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండవ కుమార్తె హయవాహి దగ్గుబాటి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ విశేషాలు మీ కోసం..
![Venkatesh Daughter Engagement : వెంకీ మామ రెండో కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన సినీ ప్రముఖులు Venkatesh Daughter Engagement](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-10-2023/1200-675-19860942-thumbnail-16x9-vemkatesh-second-daughter.jpg)
Published : Oct 26, 2023, 12:28 PM IST
ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, మహేశ్ బాబు, రానా, నాగ చైతన్య ఈ నిశ్చితార్థానికి హాజరై సందడి చేశారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, వెంకటేశ్, నీరజ దంపతులకు నలుగురు పిల్లలు. ఆశ్రిత, హయ వాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి 2019లో జరిగింది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే వెంకటేశ్ 'సైంధవ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.