మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'పొన్నియన్ సెల్వన్'. ఈ సినిమా మొదటి భాగం రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మణిరత్నం. బుధవారం విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రెడ్ లెహంగా, దుప్పట్టాలో ఐశ్వర్యరాయ్ మెస్మరైజ్ చేసింది. ఆ పోస్టర్‌కు 'ప్రతీకారానికి అందమైన ముఖం. ఆమె పళువూరు రాణి నందిని' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని లైకా సంస్థ, మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
'పళువూరు రాణి నందిని'.. యువరాణి ఆహార్యంలో మెరిసిన ఐశ్వర్యరాయ్ - shahrukh khan and vijay sethupathi
స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'పొన్నియన్ సెల్వన్-1' సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. బుధవారం సినిమాలోని ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
షారుఖ్ ఖాన్‌కు పోటీగా విజయ్‌సేతుపతి!:ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటుడు విజయ్ సేతుపతి ఒకరు. హీరో, విలన్, తండ్రి, ప్రేమికుడు.. ఇలా అన్ని క్యారెక్టర్లకూ న్యాయం చేయగలిగే స్టార్‌గా గుర్తింపు పొందారు. ఓ సందర్భంలో సేతుపతిని ప్రశంసించిన షారుఖ్ ఇప్పుడు తన సినిమాలో ఆయన్ను ప్రతినాయకుడిగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. షారుఖ్‌ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ 'జవాన్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం దర్శకుడు సేతుపతిని సంప్రదించారని, కథ విన్నాక ఇందులో నటించేందుకు అంగీకారం తెలిపారని సమాచారం. డేట్స్ సర్దుబాటైన వెంటనే విజయ్ సేతుపతి 'జవాన్' చిత్రీకరణలో పాల్గొనే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి:జలకన్యలుగా స్టార్ హీరోయిన్స్.. నీటి అడుగున ఆ అందాలను చూస్తే..