Veera Simha Reddy first day collections : 'అఖండ' తర్వాత అదే రేంజ్లో ఫుల్‌జోష్‌తో వచ్చిన బాలయ్య సినిమా 'వీరసింహా రెడ్డి'. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ అభిమానుల సందడి మధ్య సంక్రాంతి పండుగ జోరును కొనసాగించేందుకు 'వీరసింహారెడ్డి' గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ఊరమాస్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే నందమూరి అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు.
థియేటర్ల బయట భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. పాలాభిషేకాలు, టపాసులు కాల్చుతూ, తీన్‌మార్ డ్యాన్స్‌లు చేస్తూ హంగామా చేశారు. చిత్ర ప్రదర్శన మొదలయ్యాక కూడా ఇదే తరహా సందడి కనిపించింది. బాలయ్య ఎంట్రీ సీన్స్, జై బాలయ్య పాట, పంచ్ డైలాగ్‌లు వచ్చినప్పుడు. కాగితాలు ఎగురవేస్తూ సంబరాలు చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.