తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఉపేంద్ర దర్శకత్వంలో చిరంజీవి సినిమా.. కానీ! - వరుణ్​ తేజ్ గని మూవీ హీరోయిన్

Chiranjeevi Upendra movie: మెగాస్టార్​ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చిందని తెలిపారు ప్రముఖ నటుడు, దర్శకుడు ఉపేంద్ర. కానీ కొన్ని కారణాల వల్ల తాను ఆ చిత్రం చేయలేకపోయినట్లు చెప్పారు.

Chiranjeevi Upendra movie
చిరంజీవి ఉపేంద్ర సినిమా

By

Published : Apr 7, 2022, 7:12 AM IST

Updated : Apr 7, 2022, 8:42 AM IST

Chiranjeevi Upendra movie: కిరణ్​ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం 'గని'. సయీ మంజ్రేకర్​ హీరోయిన్​. కన్నడ స్టార్​ ఉపేంద్ర, బాలీవుడ్​ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్ర పోషించారు. తాజాగా చిత్ర ప్రమోషన్స్​లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో పాల్గొన్న ఉపేంద్ర పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

"నాకు మెగాఫ్యామిలీతో ఉన్న అనుబంధం గురించి చెప్పాలి. 24 ఏళ్ల క్రితం రాజశేఖర్​ చేసిన 'ఓంకారం' చిత్రానికి డైరెక్షన్​ చేశాను. ఆ సమయంలో అశ్వినీదత్​ నిర్మాణంలో మెగాస్టార్​ చిరంజీవిని డైరెక్ట్​ చేసే ఆఫర్​ వచ్చింది. కానీ నాకు అదృష్టం లేదు. ఆ సినిమా చేయలేకపోయా. ఇప్పటికీ ఆ మూవీ చేయలేకపోయానని బాధపడుతున్నా. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాను. అందులో 'ఒకేమాట'లో నాగబాబుతో, 'సన్​ ఆఫ్​ సత్యమూర్తి'లో అల్లుఅర్జున్​తో, 'గని'లో వరుణ్​తేజ్​తో కలిసి స్క్రీన్​ చేసుకోవడం సంతోషంగా ఉంది." అని పేర్కొన్నారు.

Varuntej Gani movie prerelease event: ఈ వేడుకలో వరుణ్‌ మాట్లాడుతూ.. "ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం ఉపేంద్ర సర్‌ను తప్ప దర్శకుడు కిరణ్‌ మరెవ్వరినీ ఊహించుకోలేదు. ‘ఆయన కన్నడలో బిజీగా ఉంటారు. మన చిత్రంలో చేస్తారా లేదా’ అని నేను సందేహిస్తుంటే.. కిరణ్‌ ఆయన్ను ఒప్పించి తీసుకొచ్చాడు. ఆయన ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. మీరంతా ‘గని’లో కొత్త ఉపేంద్రను చూస్తారు. సాధారణంగా నేను ఫిట్‌గా ఉండను. కోచ్‌ పాత్ర పోషించిన సునీల్‌శెట్టి స్ఫూర్తితో రోజూ జిమ్‌కు వెళ్లి ఫిట్‌గా మారా. ఈ సినిమాలో నవీన్‌ చంద్ర చాలా అద్భుతంగా నటించాడు. రామజోగయ్య శాస్త్రి పాటలు, అబ్బూరి రవి మాటలు సినిమాకు కీలకంగా నిలుస్తాయి. తమన్‌ సంగీతానికి థియేటర్లలో సౌండ్‌ బాక్సులు బద్దలవుతాయి. ఇప్పటికే చెప్పాను అయినా మరోసారి చెప్తున్నా.. బాబాయ్‌ (పవన్‌ కల్యాణ్‌) నటించిన ‘తమ్ముడు’ చిత్రం నన్నెంతో ప్రభావితం చేసింది. విభిన్న కథా చిత్రాలతో ఆయన ట్రెండ్‌ సెట్‌ చేశారు. నేను ఫాలో అవడానికి ప్రయత్నిస్తున్నానంతే. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మీ అందరి ఆదరణతో మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది" అని అన్నారు.

వరుణ్​ తేజ్​ 'గని' ఏప్రిల్​ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. జగపతిబాబు, నవీన్‌ చంద్ర, నదియా కూడా కీలక పాత్రలు పోషించారు. అల్లు బాబీ, సిద్ధు సంయుక్తంగా నిర్మించారు.

ఇదీ చూడండి: 'గని అందుకే చేశా.. వారిద్దరితో మల్టీస్టారర్​ చేయాలని ఉంది'

Last Updated : Apr 7, 2022, 8:42 AM IST

ABOUT THE AUTHOR

...view details